ముగిసిన బ్యాంకు ఉద్యోగుల సమ్మె

- February 28, 2017 , by Maagulf

యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంకు యూనియన్స్‌ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం జరిగిన సమ్మెలో ఉద్యోగులంతా పాల్గొన్నారని కన్వీనర్‌ కె.ఆదినారాయణమూర్తి తెలిపారు. ప్రజా వ్యతిరేక బ్యాంకింగ్‌ సంస్కరణలను, ఉద్యోగి వ్యతిరేక కార్మిక సంస్కరణలను, బ్యాంకు ఉద్యోగాల ఔట్‌సోర్సింగ్‌ను వ్యతిరేకిస్తూ, ఉద్యోగ నియామకాలను చేపట్టాలని, రాని బాకీల వసూలుకు కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ ఈ నిరసన చేపడుతున్నామన్నారు. జిల్లాలోని సుమారు 700 బ్యాంకు శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులంతా మంగళవారం జరిగిన బ్యాంకు ఉద్యోగుల జాతీయ సమ్మెలో పాల్గొన్నారని తెలిపారు. సమ్మె కారణంగా జిల్లాలోని బ్యాంకు శాఖలు మూతపడ్డాయి అని అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం ఖైరతాబాద్ సిండికేట్ బ్యాంకు రీజినల్ ఆఫీస్ మరియు స్టేట్ బ్యాంకు అఫ్ హైదరాబాద్​ వద్ద ఉద్యోగులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com