బీఎస్‌ఎన్‌ఎల్‌ నూతన ఆఫర్‌

- February 28, 2017 , by Maagulf
బీఎస్‌ఎన్‌ఎల్‌ నూతన ఆఫర్‌

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోస్ట్‌పెయిడ్‌ వినియోగదారులకు కొత్త ప్లాన్‌ ఆఫర్లను ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం తెలంగాణ టెలికం సర్కిల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఎల్‌.అనంతరామ్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్‌-799 (దిల్‌ ఖోల్‌ కే బోల్‌). ఈ ప్లాన్‌ నెలసరి చార్జి రూ.799. అన్‌ లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్, 6జీబీ ఉచిత డాటా మొదటి నాలుగు నెలల తదుపరి నెలకు 3జీబీ ఉచిత డాటా.

మొదటి నాలుగు నెలలకు నెలసరి అద్దె రూ.599లకు తగ్గించారు. అధిక డాటా ఆఫర్‌ ప్లాన్‌-1125లో 10జీబీ ఉచిత డాటా, ప్లాన్‌-1525లో 30జీబీ ఉచిత డాటా, ప్రమోషనల్‌ ఆఫర్‌గా ప్రస్తుత కొత్త వినియోగదారులకు మూడు నెలల పాటు వర్తిస్తుంది.
వివరాలకు 1503 లేదా 18001801503 నంబర్లలో సంప్రదించొచ్చు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com