తీగలను దొంగిలించిన ఇద్దరు పాకిస్థానీయులకు జైలు శిక్ష
- March 01, 2017
దుబాయ్ : గార్డుని గాయపరిచి ఒక నిర్మాణ స్థలం నుండి తీగలను దొంగిలించారని అభియోగంపై ఇరువురు పాకిస్థానీయులకు ఒకొక్కరకి ఆరునెలల జైలుశిక్ష విధించారు. ఉద్యోగం సద్యోగం లేని ఆ ఇరువురు వయస్సు 25 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ వరకు ఉంటుంది. గతంలోనే ఈ వ్యక్తులకు నేరచరిత్ర ఉంది. ఈ సహచరులు జనవరి 28, 2015, వారు అల్ ఖవానీజ్ ,అల్ రాషిదీయహ్ నిర్మాణ స్థలం నుండి 14,000 ధిర్హాంల విలువ చేసే తీగలను తంతులు దొంగిలించారనే నేరం వీరిపై ఆరోపించబడింది. వీరు ఇరువురు దొంగతనంకు వెళ్లిన సమయంలో సెక్యూరిటీ గార్డు మేల్కొన్నాడు. అయితే వీరు ఒక కర్రతో ఆ భద్రతకు నియమించబడిన వ్యక్తిని బెదిరించి ఒక పదునైన పరికరంతో అక్కడ ఉన్నతీగలను అపహరించారు. ఈ దొంగతనం విషయమై కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ ఎదుట తమ నేరాన్ని అంగీకరించారు. అయితే, వారు దోషులుగా కోర్టు జైలు శిక్షని పూర్తి చేసిన తర్వాత వారిని దేశ బహిష్కరణకు ఆదేశించారు.
తాజా వార్తలు
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత
- ప్రయాణికులకు వీసీ సజ్జనార్ కీలక సూచన..
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!







