మహేష్ బాబు తరుపున భారీ విరాళం అందజేసిన నమ్రత ఊరి కోసం...
- March 01, 2017
హైదరాబాద్: ఊరికోసం ఏదైనా చేయాలనే కాన్సెప్టుతో వచ్చిన మహేష్ బాబు 'శ్రీమంతుడు' సినిమా తర్వాత గ్రామాలను దత్తత తీసుకోవడం, ఊరి బాగు కోసం మంచి చేయడం లాంటివి చాలా మంది ఆచరిస్తున్నారు. మహేష్ బాబు కూడా స్వయంగా దీన్ని ఆచరిస్తూ... అభిమానులు తన దారిలో నడిచేలా చేస్తున్నాడు.
శ్రీమంతుడు సినిమా తర్వాత తెలుగు రాష్ట్రాల్లో మహేష్ బాబు రెండు గ్రామాలను దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లోని తన తండ్రి స్వగ్రామమైన బుర్రిపాలెంతో పాటు తెలంగాణలో సిద్దాపురం గ్రామాన్ని ఆయన దత్తత తీసుకున్నారు. ఈ రెండు గ్రామాల అభివృద్ధికి సంబంధించిన పనులను మహేష్ బాబు సతీమణి నమ్రత చూసుకుంటన్నారు.
తాజాగా నమ్రత రూ.30 లక్షలను నాట్కో ట్రస్టు ద్వారా సిద్దాపురం లో అభివృద్ధి పనుల కోసం అందజేసారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్ రావు చెక్ ను అందజేశారు..
రూ. 30 లక్షలను గ్రామంలో పాఠశాల నిర్మాణం కోసం వెచ్చించనున్నట్లు తెలుస్తోంది. రెండు గ్రామాలను సంబంధించిన అభివృద్ధి పనులను నమ్రత ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంత సౌమ్యుడో అందరికీ తెలిసిందే. వివాదాలకు ఆయన వీలైనంత దూరంగా ఉంటారు. తాజాగా మహేష్ బాబు ఓ వివాదానికి మద్దతు ఇవ్వడం చర్చనీయాంశం అయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
త్వరలోనే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు మహేష్ బాబు సతీమణి నమ్రత. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
తాజా వార్తలు
- Tajikistan Launches International Dialogue on Sustainable Tourism and Heritage Preservation
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత
- ప్రయాణికులకు వీసీ సజ్జనార్ కీలక సూచన..
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!







