'బ్రూస్లీ'పైనే జీవీ ఆశలు
- March 03, 2017
చెన్నై: కోలీవుడ్‌లో వరుస చిత్రాలతో దూసుకుపోతున్న యువహీరో జీవీ ప్రకాశ్. ఆయన సినిమా అంటేనే కుర్రకారు ఎగబడుతుంది. అంతలా ఆకట్టుకునే విధంగా గిలిగింతలు పెట్టే సన్నివేశాలు, వూర్రూతలూగించే పాటలు ఉంటాయి. ఇప్పుడు ఈ యువ హీరో జోరుకు కాస్త బ్రేక్ పడినట్లుంది. అసలు విషయం ఏమిటంటే.. జీవీ ప్రకాశ్ తన తర్వాత చిత్రం బ్రూస్లీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఆయన నటించి విడుదలైన కొన్ని చిత్రాలు అనుకున్నంతగా ఆకట్టుకోలేదు. దీంతో తన దృష్టిని బ్రూస్లీ చిత్రంపై కేంద్రీకరించారు. ఈ సినిమా చాలా రోజులుగా షూటింగ్ దశలోనే ఉంది. ఇది ఆలస్యం అవుతున్నప్పటికీ తనకు మంచి విజయాన్ని అందిస్తుందనే ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నారు జీవి.
ఈ చిత్రంలో జీవీ సరసన కీర్తి కర్బందన అనే కొత్తనటి నటిస్తోంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







