తీవ్రవాదంపై ఉమ్మడిపోరు అవసరం: కింగ్ సల్మాన్
- March 03, 2017
సౌదీ అరేబియా కింగ్ సల్మాన్, తీవ్రవాదంపై ఉమ్మడి పోరు అవసరమని నినదించారు. ఇండోనేసియా పార్లమెంటులో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. 50 ఏళ్ళలో సౌదీ కింగ్ ఇండోనేసియాలో పర్యటించడం ఇదే తొలిసారి. 1000 మందికి పైగా డెలిగేషన్‌తో, వందలాది టన్నుల లగేజ్‌తో కింగ్ సల్మాన్ ఇండోనేసియాలో పర్యటించడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. రాజధాని జకార్తాలోని వందలాదిమంది హాజరు కాగా, లెజిస్లేచర్‌ని ఉద్దేశించి కింగ్ సల్మాన్ ప్రసంగించారు. ముస్లిం సమాజం తీవ్రవాదాన్ని ఎదుర్కొనడం దురదృష్టకరమని, ప్రతి ఒక్కరూ తీవ్రవాదానికి వ్యతిరేకంగా నినదించాల్సిన సందర్భమని ఆయన అన్నారు. ఐసిస్‌కి వ్యతిరేకంగా అమెరికాతో కలిసి సౌదీ అరేబియా - సిరియాలో పోరాటం చేస్తోందని చెప్పారాయన. ఇండోనేసియా కూడా ఇస్లామిక్ తీవ్రవాదంతో సమస్యలు ఎదుర్కొటున్న దేశమని, ప్రపంచ దేశాలన్నీ తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడవలసి ఉందని చెప్పారు కింగ్. జకార్తాలోని ఇస్తిక్‌లాల్ మసీదుని సందర్శించారు గురువారం సల్మాన్. ఆయన వెంట ప్రెసిడెంట్ విదోదో కూడా ఉన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







