మూతపడ్డ ఇండో-నేపాల్ సరిహద్దు

- March 03, 2017 , by Maagulf
మూతపడ్డ ఇండో-నేపాల్ సరిహద్దు

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఆరో దశ పోలింగ్‌ను దృష్టిలో ఉంచుకుని 24 గంటలకు ముందే భారత్-నేపాల్ సరిహద్దును మూసేశారు. శనివారంనాడు 49 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగనుంది. పోలింగ్‌ను దృష్టిలో ఉంచుకుని 84 కిలోమీటర్ల మేర ఇండో-నేపాల్ సరిహద్దులను మూసేశామని, పోలింగ్ ముగిసేంతవరకూ ఈ చర్యలు అమల్లో ఉంటాయని జిల్లా ఎలక్టోరల్ అధికారి వీరేంద్ర కుమార్ సింగ్ తెలిపారు. సరిహద్దుల వెంబడి రెండు నిఘా కెమేరాలు కూడా ఏర్పాటు చేశామన్నారు. కాగా, చివరి విడత ఎన్నికల పోలింగ్ ఈనెల 8న జరుగుతుంది. 11న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com