రికార్డు ఉష్ణోగ్రత... పరిశోధకుల ఆందోళన
- March 04, 2017
ఓస్లో: వాతావరణ మార్పుల మూలంగా ధృవప్రాంతాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు పరిశోధకులను కలవరపెడుతున్నాయి. ఉత్తర అంటార్కిటిక్ ద్వీపకల్పంలోని అర్జెంటీనా రీసెర్చ్ సెంటర్ ఎస్పరాంజా బేస్ వద్ద రికార్డు స్థాయిలో 17.5 డిగ్రీ సెంటీగ్రేడ్ ల ఉష్ణోగ్రత నమోదైందని ప్రపంచ వాతావరణ సంస్థ ఇటీవల వెల్లడించింది. ఈ ప్రాంతంలోని వాండా స్టేషన్ లో1982 జనవరి 5న నమోదైన 15 డిగ్రీ సెంటీగ్రేడ్ ల ఉష్ణోగ్రత రికార్డును ఇది అదిగమించింది.
ధృవ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల మార్పులను అధ్యయనం చేయడం ద్వారా భూమిపై వాతావరణ మార్పులను అధ్యయనం చేయడానికి తోడ్పడుతుందని ప్రపంచ వాతావరణ సంస్థలో ప్రముఖ పరిశోధకుడు మైఖేల్ స్పారో వెల్లడించారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా అంటార్కిటికాలో ఉన్న మంచు కరిగి సముద్రమట్టాలు పెరిగుతాయని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







