ఫలక్ నామ ఎక్స్ప్రెస్ లో బాంబు కలకలం
- September 22, 2015
ఫలక్ నామ ఎక్స్ ప్రెస్ కు పెద్ద ముప్పు తప్పింది. ఆ రైల్లో గుర్తుతెలియని వ్యక్తులు పెట్టిన బాంబును రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది గుర్తించారు. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్ కతాలోని హౌరా రైల్వేస్టేషన్ లో ఈ రైలు ఆగి ఉన్న సమయంలో బాంబును గుర్తించారు. రైల్లో ఓ సిలిండర్ అనుమానాస్పదంగా కనిపించడంతో వాళ్లు దాన్ని తనిఖీ చేశారు. వెంటనే బాంబు డిస్పోజల్ స్క్వాడ్ కు సమాచారం అందించడంతో వాళ్లు వచ్చి, ఆ సిలిండర్ ను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి, అక్కడ దాన్ని నిర్వీర్యం చేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. స్టేషన్ లో ఉన్న సమయంలో రైల్లో పేలుడు సంభవించి ఉంటే, నష్టం తీవ్రత ఎక్కువగానే ఉండేదని నిపుణులు అంటున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!







