గూగుల్ స్ట్రీట్ వ్యూ '3డీ'లో చార్మినార్ కూడా..
- September 23, 2015
భారతదేశంలోని అన్ని నగరాలు, పర్వతాలు, నదులు, ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రాలను 3డీలో, 360 డిగ్రీల కోణంలో అత్యంత స్పష్టంగా కళ్లకు కట్టినట్లుగా ఇక ముందు 'గూగుల్ స్ట్రీట్ వ్యూ'లో వీక్షించే సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది. అందుకు భారత ప్రభుత్వం గూగుల్ కు అనుమతి ఇవ్వడానికి సిద్దం అయ్యిందని మంగళవారం సంబంధిత అధికారులు న్యూఢిల్లీలో చెప్పారు. అయితే రక్షణ రంగ నిర్మాణాలు, అణు కార్యక్రమాల ప్రదేశాలతో పాటు దేశంలోని సున్నితమైన ప్రాంతాలు గూగుల్ లో అందుబాటులోకి రావని అధికారులు అన్నారు. దేశంలోని సుందరమైన ప్రాంతాలు ప్రజలు వీక్షించడానికి వీలుగా ప్రముఖ ఇంటర్నెట్ సంస్థ గూగుల్ కు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఇప్పటికే కేంద్ర హోం శాఖ, రక్షణ, విదేశీ వ్యవహారాలు, పీఎంఓ శాఖల ఉన్నతాధికారులు ఈ విషయంపై చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి విధివిధానాలను రూపొందించారని, గూగుల్ కు లాంఛనంగా త్వరలో సమాచారం అందిచనున్నామని సంబంధింత అధికారులు స్పష్టం చేశారు. గూగుల్ స్ట్రీట్ ప్యూలో 2007 నుంచి అమెరికా, కెనడా, యూరోప్ దేశాల అందమైన ప్రదేశాలు గూగుల్ స్ట్రీట్ వ్యూలో ఉన్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







