ఓవర్సీస్ లో మనోజ్ కు మరోసారి చేదు అనుభవం
- March 05, 2017
శౌర్య , ఎటాక్ చిత్రాలతో భారీ ప్లాపులు చవిచూసిన మంచు మనోజ్ కు గుంటూరోడు కూడా హిట్ ను ఇవ్వలేకపోగా ఓవర్సీస్ లో మరోసారి చేదు అనుభవాన్ని మిగిల్చింది. మనోజ్ కెరియర్లో బాగా బాధకు గురిచేసిన చిత్రం శౌర్య. తన తన శైలికి కొత్తగా ట్రై చేసిన చిత్రం. తన కెరియర్లో ఓ మలుపు తిరుగుతుందని , ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ ఈ సినిమా ఏ రేంజి లో ప్లాప్ అయ్యిందంటే, ఈ మూవీ ని ఓవర్సీస్ లో ప్రీమియర్ షోస్ వేస్తే ఒక్కరు కూడా షో కు రాలేదట. దీంతో షోస్ కాన్సల్ చేసే పరిస్థితి వచ్చింది. ఈ సంఘటన మనోజ్ ను తీవ్ర బాధకు గురిచేసిందట.
మళ్లీ అదే తరహాలో గుంటూరోడు బాధను పెట్టిందని తెలుస్తుంది.
మాస్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఫై మనోజ్ గట్టి నమ్మకాలే పెట్టుకున్నాడు. ఇక ఈ మూవీ ఓవర్సీస్ లో ప్రీమియర్ షోస్ వేయగా కేవలం వెయ్యి డాలర్లకు కొంచెం ఎక్కువగా వసూలు చేసిందంతే. దీంతో పాటు రిలీజ్ అయినా 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' 7 వేల డాలర్లకు పైగా వసూలు చేస్తే.. 'పెళ్లిచూపులు' ఫేమ్ విజయ్ దేవరకొండ నటించిన 'ద్వారక' అన్నిటికంటే మెరుగ్గా 11 వేల డాలర్లకు పైగా వసూలు చేసిందట.
మొత్తానికి మనోజ్ ను ప్లాప్స్ వెంటపడుతూనే ఉన్నాయి. మరి హిట్ ఇచ్చే ఆ డైరెక్టర్ ఎవరో చూడాలి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







