మునక్కాయ సూప్
- March 05, 2017
కావలసిన పదార్థాలు: మునగ కాయలు - 2 అంగుళాల ముక్కలు 12, వెల్లుల్లి రెబ్బలు - 5, జీలకర్ర - 1 టీ స్పూను, మిరియాలు - అర టీ స్పూను, చిన్న ఉల్లిపాయలు - 4, కరివేపాకు 4 రెబ్బలు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - 1 టీ స్పూను.
తయారుచేసే విధానం: కప్పు నీటిలో మునగ ముక్కలు ఉడికించాలి. చల్లారిన తర్వాత స్పూను లేదా చాకుతో గుజ్జును లాగి గ్రైండ్ చేసుకోవాలి. నూనెలో జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి, ఉల్లి తరుగు వేగించి మునగ గుజ్జు కలపాలి. తర్వాత ఉప్పు, కరివేపాకుతో పాటు 4 కప్పుల నీరు పోసి కొద్దిగా చిక్కబడ్డాక దించేయాలి. ‘ఎ’ విటమిన్ పుష్కలంగా ఉండే ఈ మునగ సూప్ ఆరోగ్యానికి ఎంతో మంచిది.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







