'ఊ' కొత్త సినిమా
- March 05, 2017
'ఊ' కొత్త సినిమా కొన్ని సినిమాలు టైటిల్ తోనే ఆసక్తిరేపుతాయి. అలాంటి పేరే ఇది. ఇంతకీ టైటిల్ ఏమిటంటే.. ఊ. జస్ట్ ఊ మాత్రమే. అదే వెరైటీ. 'నిధి' ప్రసాద్. శ్రీకాంత్ హీరోగా అతను తెరకెక్కించిన 'నిధి'. అయితే ఈ చిత్రం చేదు అనుభవమే మిగిల్చింది. అయినా ఆ సినిమా అతడి ఇంటి పేరుగా మారిపోయింది. తర్వాత అందరూ దొంగలే.. భాగ్యలక్ష్మి బంపర్ డ్రా.. మైకేల్ మదన కామరాజు లాంటి వినోదాత్మక సినిమాలు తీశాడు ప్రసాద్. ఇప్పుడు దాదాపు ఎనుమిదేళ్ళ గ్యాప్ తర్వాత మరో సినిమాతో వచ్చాడు. రాజేంద్ర ప్రసాద్.. బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ఇది. ఈ చిత్ర ప్రి లుక్ కూడా రిలీజ్ చేశాడు ప్రసాద్. ఈ సినిమా టైటిల్ 'ఊ'.ప్రీ లుక్ లో రాజేంద్ర ప్రసాద్.. బ్రహ్మానందం కనిపించారు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఇంకా చాలామంది కమెడియన్లు వున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ చెబుతారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







