సౌదీ అరేబియాలో నకిలీ క్రీడా ఉత్పత్తులపై దాడులు
- March 06, 2017
నకిలీ ఉత్పత్తులు దేశంలో విస్తరించకుండా ఉండేందుకు కఠిన చర్యలు అమలు చేయనున్నట్లు వాణిజ్య సౌదీ అరేబియా వాణిజ్య మరియు పెట్టుబడి మంత్రిత్వ శాఖ తెలిపింది.మరోవైపున ఇప్పటికే నకిలీ క్రీడా వస్తువుల అణిచివేత కార్యక్రమం ప్రారంభించింది. వాణిజ్య మరియు పెట్టుబడి మంత్రిత్వశాఖ వినియోగదారుల రక్షణ విభాగం సుంకాల అధికారులు సమన్వయంతో,నకిలీ ఉత్పత్తుల డీలర్స్ వ్యతిరేకంగా ఫిర్యాదులు స్వీకరించడం మరియు దర్యాప్తు జరిపేందుకు ఒక జట్టుని ఏర్పాటు చేయనుంది. ఆ తర్వాత నేర తీవ్రతని నిర్ణయించి వారిని అరెస్టు చేసి కోర్టులకు అప్పగించనున్నారు. మంత్రిత్వశాఖ లోని వినియోగదారుల రక్షణ కోసం నియమించబడిన సహాయక కార్యదర్శి ఫాహ్డ్ అల్ హుతైలి ఈ సందర్భంగా మాట్లాడుతూ నకిలీ క్రీడా వస్తువులు విక్రయిస్తున్నవారిపై ఇప్పటికే పరిశోధన పబ్లిక్ ప్రాసిక్యూషన్ బ్యూరో కు సూచిస్తారు. సౌదీ ట్రేడ్‌మార్క్, కాపీరైట్ మరియు వాణిజ్య మోసం నిబంధనల ప్రకారం శిక్షించబడతారని చెప్పారు.మంత్రిత్వ శాఖ మరియు సాధారణ స్పోర్ట్స్ కమీషన్ క్రీడా సంఘాలని 'వ్యాపారులు చేసే మోసాలను ఆయా సంస్థల గుర్తులు రక్షించే ప్రయత్నంలో కింగ్డమ్ చుట్టూ ఉన్న 3.755 పైగా ఉన్న దుకాణాలలో తనిఖీలను చేపట్టారనితెలిపారు. తనిఖీల అనంతరం 71.157 నకిలీ ఉత్పత్తులను జప్తు ,558 ఉల్లంఘనలు గుర్తించి వారికి నోటీసులు జారీ చేశారు.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







