ఉమెన్స్ డేకి స్పైస్ జెట్ బంపర్ ఆఫర్
- March 06, 2017
అంతర్జాతీయ మహిళా దినోత్సవం స్పైస్ జెట్ విమానమెక్కే మహిళా ప్రయాణికులకు ఆ విమానయాన సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. 2017 మార్చి 8న స్పైస్ జెట్ విమానంలో ప్రయాణించే మహిళలు స్పైస్ మ్యాక్స్ లోకి అప్ గ్రేడ్ అవుతారని పేర్కొంది. అంతేకాక బుధవారం రోజు ఒంటరిగా ప్రయాణించే మహిళల కోసం ఒక వరుసమొత్తాన్ని కేటాయించనున్నట్టు స్పైస్ జెట్ ప్రకటించింది.'' 2017 మార్చి 8న ఒంటరిగా ప్రయాణించే మహిళా ప్రయాణికులకు ప్రత్యేక హక్కులు కల్పిస్తున్నాం. ఒకవేళ అందుబాటులో ఉంటే ఉచితంగా స్పైస్ మ్యాక్స్ సీట్లలోకి వారిని అప్ గ్రేడ్ చేస్తాం'' అని స్పైస్ జెట్ ఓ ప్రకటన విడుదల చేసింది.
2017 మార్చి 8 నుంచి నాలుగో వరుస మొత్తాన్ని స్పైస్ జెట్ మహిళలకే కేటాయించనుంది. మహిళలకు స్పెషల్ సీట్లను తొలుత ఎయిర్ ఇండియా అందుబాటులోకి తెచ్చింది. స్పెషల్ సీటింగ్ కేటాయింపుల వల్ల సోలోగా ప్రయాణించే మహిళకు సౌకర్యవంతంగా ఉంటుందని స్పైస్ జెట్ తెలిపింది. స్పైస్ మ్యాక్స్ ఆఫర్ కింద స్పైస్ జెట్ విమానయాన సంస్థ తమ వెబ్ సైట్లో బుకింగ్స్ పై ఫ్లాట్ పై 15 శాతం డిస్కౌంట్ ఇస్తుంది. సోమవారం రోజు ఈ ఆఫర్ కింద డిస్కౌంట్లు వర్తించవు. రెండు వైపుల ప్రయాణాలకు ఇది అందుబాటులో ఉంటుంది. 2017 మార్చి 31 వరకు స్పైస్ మ్యాక్స్ ఆఫర్ కింద ప్రయాణికులు బుకింగ్స్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!