బరువు తగ్గాలంటే.. మెట్లెక్కి దిగండి.. సైకిల్ తొక్కండి.. స్కిప్పింగ్ ఆడండి
- March 06, 2017రోజూ అరగంట పాటు నడక.. అరగంట పాటు సైక్లింగ్ చేయడం ద్వారా బరువు తగ్గుతారు. వీలైనంతవరకు నడకకు ప్రాధాన్యం ఇవ్వండి. ఇది వ్యాయామంలా అనిపించకపోయినా.. తెలియకుండానే కెలోరీలు ఖర్చైపోతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే జిమ్‌లకు వెళ్లకుండా ఇంట్లోనే మెట్లెక్కి దిగడం, కూర్చున్న చోటే కాళ్ళు, చేతుల్ని సాగదీయడం.. గుంజిళ్ళు తీయడం చేతుల్ని గుండ్రంగా తిప్పడం వంటివన్నీ వ్యాయామంలో భాగమేనని గుర్తించాలి.
సైకిలు తొక్కడం మొదలుపెట్టండి. చిన్నచిన్న పనులకు దానిపై వెళ్లడం అలవాటుగా మార్చుకుని చూడండి. అలాగే ఓ పదినిమిషాలు దొరికాయా. ఆ కాసేపూ స్కిప్పింగ్ ఆడండి. లేదా ఉన్నచోటే గెంతడం చేయండి. లేదా ఏదైనా డ్యాన్స్ క్లాసులో చేరండి. తప్పనిసరిగా వ్యాయాయమే చేయాలనే నియమాన్ని పెట్టుకోకుండా టైమ్ దొరికితే అలా నడవడం, గెంతడం, మెట్లెక్కి దిగడం వంటివి చేస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూర్చినవారవుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
తాజా వార్తలు
- పాకిస్థాన్‌లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్‌కు గూగుల్ చెక్