లక్నోలో ఉగ్రవాదులు కలకలం
- March 07, 2017
లక్నోలోని ఠాకూర్‌గంజ్‌లో ఉగ్రవాదులు కలకలం రేపారు. ఓ ఇంట్లో చొరబడిన ఉగ్రవాదులు కాల్పులకు దిగడంతో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ రంగంలోకి దిగింది. ఆ చుట్టుపక్కల ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకుని ఆ ఇంటిని చుట్టుముట్టింది. ఇంట్లో ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిని మధ్యప్రదేశ్‌కు చెందిన వారిగా గుర్తించారు. వారి వద్ద భారీ ఆయుధాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. ఉగ్రవాదుల్లో ఒకరిని సైఫుల్లాగా పోలీసులు గుర్తించారు. ఓవైపు పోలీస్ ఆపరేషన్ జరుగుతుండగా, మరోవైపు యూపీ హోం మంత్రిత్వ శాఖ, పోలీసులు ఉన్నతాధికారులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ ఘటనపై సమీక్ష జరుపుతోంది.
తాజా వార్తలు
- కెనడా కొత్త పౌరసత్వ చట్టం
- అమెరికాలో శంకర నేత్రాలయ ఫండ్‌రైజింగ్ సంగీత కార్యక్రమం
- IBSA సమావేశంలో ప్రధాని మోదీ కీలక సూచనలు
- ఫ్యూచర్ సిటీలో పర్యటించిన సీఎం రేవంత్
- అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పై కీలకమైన అప్ డేట్
- వాషింగ్టన్లో వెబ్ సమ్మిట్ ఖతార్ 2026 ప్రమోషన్..!!
- అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ తాత్కాలికంగా ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో యూఏఈ అధ్యక్షుడికి అరుదైన గౌరవం..!!
- ట్రాన్స్పోర్ట్ అథారిటీ అదుపులో 1,349 మంది..!!
- పని ప్రదేశంలో మీ హక్కులు తెలుసా?







