ఉపగ్రహాల ప్రయోగంలో చైనా కొత్త పుంతలు!
- March 07, 2017
ఉపగ్రహాల ప్రయోగంలో చైనా వినూత్నంగా ముందుకెళ్లనుంది. సాధారణంగా ప్రత్యేక లాంచ్ ప్యాడ్ ల ద్వారా రాకెట్లను ప్రయోగించి ఉపగ్రహాలను అంతరిక్షంలోని కక్ష్యల్లో ప్రవేశపెట్టేందుకు విభిన్నంగా ప్రయోగాలు చేయనుంది.
ఏకంగా యుద్ధ విమానాల ద్వారా రాకెట్లను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనున్నట్లు చైనాకు చెందిన ఓ పత్రిక తెలిపింది. వందల ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడంతోపాటు వాణిజ్యపరమైన, శాస్త్రపరమైన లక్ష్యాలను నెరవేర్చుకునే ఉద్దేశంతోనే ఈ దిశగా ముందుకెళుతున్నట్లుగా బీజింగ్ అధికారులు తెలిపినట్లు పేర్కొంది.
లాంచ్ వెహికల్ టెక్నాలజీని అందించే ది చైనా అకాడమీ ప్రస్తుతం 100 కేజీల పేలోడ్ లను మోసుకెళ్లగల సాంద్ర ఇంధన రాకెట్ల పరిజ్ఞానాన్ని రూపొందించినట్లు రాకెట్ డెవలప్ మెంట్ వ్యవహారాలు చూసుకునే సంస్థ డైరెక్టర్ లి టోంగ్యూ తెలిపారు.
చైనా అంతరిక్ష కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ చెబుతున్నారని, ఈ కార్యక్రమానికి ఆయన అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నారు.
అమెరికా, రష్యాలతో పోల్చినప్పుడు ఈ విషయంలో చైనా కొంత వెనకబడి ఉన్నందున వాటికి సమానంగా అంతరిక్ష రంగంలో కూడా దూసుకెళ్లేలా చేయాలని అధ్యక్షుడు ఆదేశించారని లి టోంగ్యూ చెప్పారు.
ఈ నేపథ్యంలో వై-20 వ్యూహాత్మక యుద్ధ విమానాలు మోసుకెళ్లగలిగే రాకెట్ లను సిద్ధం చేస్తున్నామని, వీటి ద్వరానే రాకెట్ల ప్రయోగాలు జరిపి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనున్నామని వెల్లడించారు.
మరోవైపు చైనా మొట్టమొదటి కార్గో ఎయిర్ క్రాఫ్ట్ ప్రయాణం ఏప్రిల్ లో మొదలు కానుంది. 2022 నాటికి చైనా కూడా శాశ్వత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అనుకుంటున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- కెనడా కొత్త పౌరసత్వ చట్టం
- అమెరికాలో శంకర నేత్రాలయ ఫండ్రైజింగ్ సంగీత కార్యక్రమం
- IBSA సమావేశంలో ప్రధాని మోదీ కీలక సూచనలు
- ఫ్యూచర్ సిటీలో పర్యటించిన సీఎం రేవంత్
- అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పై కీలకమైన అప్ డేట్
- వాషింగ్టన్లో వెబ్ సమ్మిట్ ఖతార్ 2026 ప్రమోషన్..!!
- అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ తాత్కాలికంగా ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో యూఏఈ అధ్యక్షుడికి అరుదైన గౌరవం..!!
- ట్రాన్స్పోర్ట్ అథారిటీ అదుపులో 1,349 మంది..!!
- పని ప్రదేశంలో మీ హక్కులు తెలుసా?







