బెల్లీ ఫ్యాట్ కరగకపోవడానికి గల ముఖ్య కారణాలు
- September 23, 2015
ప్రస్తుత ఉరుకులపరుగుల జీవితంలో ఆరోగ్యం మీద మరియు బరువు మీద ఏకాగ్రతపెట్టడం లేదా జాగ్రత్తలు తీసుకోవడం చాలా తక్కువ. ఉదయం లేచిన దగ్గర నుండి పడుకొనే వరకూ దిన చర్యల్లో మునిగితేలుతు ఆరోగ్యం గురించి పట్టించుకోవడం మానేస్తున్నారు. ఫలితంగా ఊబకాయం, మధుమేహం, హార్ట్ సమస్యలు, కీళ్ళనొప్పులు, ఆర్థరైటిస్ వంటి ఆరోగ్య సమస్యలకు గురి అవుతున్నారు. ఆరోగ్యంతో పాటు, నడుము చుట్టు కొలత పెరిగే కొద్ది, శరీరంలో ఆరోగ్య సమస్యలు ఒకటి వెనుక మరొకొట ప్రారంభమవుతాయి. కాబట్టి, ఆరోగ్యంతో పాటు బరువును కంట్రోల్ చేసుకోవాలి. బొజ్జతో అనర్థాలు: బొజ్జ తగ్గించే చిట్కాలు అధిక బరువుకు కారణం జన్యుపరమైన కారణాలు మరియు జీవనశైలిలో మార్పులే ప్రధాణ కారణం. అయితే బరువు తగ్గించుకోగలుగుతున్నారు కానీ, బెల్లీ ఫ్యాట్ మాత్రం కరగకపోవడానికి కారణాలు తెలియదు. బరువ తగ్గించుకోవడం తేలికే కానీ, బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడం చాలా కష్టం. అందుకు మీరు రెగ్యులర్ గా చేసే పనుల్లో కొన్ని మార్పులు చేసుకుంటూ కంట్రోల్ చేసుకొన్నట్లైతే బెల్లీ కరిగించుకోవడం సాద్యం అవుతుంది. పెళ్లి తర్వాత బరువు తగ్గించి..బొజ్జ కరిగించే సూపర్ ఫుడ్స్ ఎన్నివ్యాయామాలు, యోగాలు, జిమ్ లు చేసిన బరువు తగ్గుతున్నారు కానీ, బెల్లీ ఎందుకు తగ్గుట లేదో తెలుసుకోవాలంటే ఈ క్రింది స్లైడ్ లోని కారణాలును మీరు తెలుసుకోవాల్సిందే... మీరు ఇప్పటికీ వ్యాయామాలు రెగ్యులర్ గా చేస్తున్నా మీ బరువులో కానీ లేదా బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడంలోని కానీ ఎలాంటి మార్పులు కనబడకుంటే అందుకు మీరు చేసే వ్యాయామాలు తప్పువై ఉంటాయి. ఇలా రెగ్యులర్ వ్యాయాలు హార్ట్ కు మంచిదే అయినా, మీ నడుము లేదా పొట్ట తగ్గించుకోవడంలో ఎలాంటి మార్పులను చూపించదు. తరచూ ప్రొసెస్డ్ ఫుడ్స్ తినడం వల్ల ఖచ్చితంగా నడుము సైజు పెరుగుతుంది. కాబట్టి రెగ్యులర్ డైట్ నుండి ప్రొసెస్డ్ ఫుడ్స్ ను తినకుండా నివారించాలి. ఎక్కువ ఫ్యాట్ తీసుకోవడం వల్ల శరీరంలో క్యాలరీలు పెరుగుతాయి. ఫలితంగా బరువు పెరుగుతారు. కాబట్టి, హెల్తీ ఫ్యాట్స్ ను తీసుకోవడం మంచిది . హెల్తీ ఫ్యాట్స్ అయినా మితంగా తీసుకోవడం మంచిది. మీరు ఎక్కువ స్ట్రెస్ లో ఉన్నాయ అనసవరంగా బరువు పెరుగుతారు. అధిక ఒత్తిడి వల్ల శరీరంలో కార్టిసోల్ అనే హార్మోను ఉత్పత్తి వల్ల శరీరంలో ఫ్యాట్ పెంచేస్తుంది. నిద్రలేమి వల్ల ఇతర ఆరోగ్య సమస్యలతో పాటు బరువును కూడా అమాంతం పెంచేస్తుంది. కాబట్టి ప్రతి రోజై కనీసం 8 గంటల నిద్ర తప్పనిసరి. మీరు ఎప్పుడూ లేజీగా ఉండటం మరియు యాక్టివ్ గా లేకపోవడం వల్ల బెల్లీ మరింత తీవ్రంగా పెరిగే అవకాశాలున్నాయి. కాబట్టి, యాక్టివ్ మరియు హెల్తీగా ఉండాలి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







