ఈద్ ప్రార్థనల్లో నాయకులు
- September 23, 2015
అబుదాబీ క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యామ్ గురువారం షేక్ జాయెద్ గ్రాండ్ మసీదు వద్ద జరిగే ఈద్ అల్ అదా ప్రార్థనల్లో పాల్గొంటున్నారు. ఈద్ ప్రార్థనల తొలి రోజు పెద్ద సంఖ్యలో దేశానికి చెందిన షేక్‌లు, మంత్రులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. అలాగే పెద్ద సంఖ్యలో భక్తులూ హాజరవుతారు. అజ్మాన్ రూలర్, సుప్రీం కౌన్సిల్ మెంబర్ షేక్ హుమాయిద్ బిన్ రషీద్ అల్ నౌమి ఈద్ అల్ అదా ప్రార్థనల్ని అజ్మాన్‌లోని షేక్ రషీద్ మిన్ హుమాయిద్ అల్ నౌమి మసీదు వద్ద నిర్వహిస్తారు. క్రౌన్ ప్రిన్స్ షేక్ అమ్మార్ బిన్ హుమాయిద్ అల్ నౌమి కూడా ఈ ప్రార్థనలకు హాజరవుతారు. అధికారులు, పౌరులు, అరబ్ మరియు ఇస్లామిక్ కమ్యూనిటీస్‌కి చెందిన సభ్యులు కూడా ఈ ప్రార్థనల్లో పాలుపంచుకుంటారు. యూఏక్యూ కౌన్సిల్ మెంబర్ మరియు పాలకుడు అయిన షేక్ సౌద్ బిన్ రషీద్ అల్ ముఅల్లా, గురువారం ఉదయం షేక్ జాయెద్ మాస్క్‌లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఫజైరా రూలర్, సుప్రీం కౌన్సిల్ మెంబర్ షేక్ హమాద్ బిన్ మహమ్మద్ అల్ షర్కి న్యూ షేక్ జాయెద్ మసీదులో ప్రార్థనలు చేస్తారు. పజైరా క్రౌన్ ప్రిన్స్ షేక్ మహమ్మద్ బిన్ హమాద్ బిన్ మహమ్మద్ అల్ షర్కి, షేక్ డాక్టర్ రషీద్ బిన్ హమద్ బిన్ మహమ్మద్ అల్ షర్కీ, షేక్ మక్తూమ్ బిన్ హమాద్ బిన్ మహమ్మద్ అల్ షర్కీ తదితరులు ఈ ప్రార్థనల్లో పాల్గొంటారు. ఈద్ ప్రార్ధనల తర్వాత షేక్‌లు, మంత్రులు, సీనియర్ అధికారులు యూఏఈ గుర్తింపు పొందిన అరబ్ మరియు దౌత్య సిబ్బంది, ఎమిరేట్ ఉన్నతాధికారులు మరియు అరబ్ మరియు విదేశీ కమ్యూనిటీలు, ఇతర ప్రతినిథులు షేక్ హమాద్‌కి శుభాకాంక్షలు తెలియజేస్తారు. రస్ అల్ ఖైమా పాలకుడు, సుప్రీం కౌన్సిల్ మెంబర్ షేక్ సౌద్ బిన్ సక్ర్అల్ కష్మి ఖుజామ్లోని గ్రాండ్ ఈద్ ముసలాలో ప్రత్యేక ఈద్ అల్ అధా ప్రార్ధనలు నిర్వహిస్తారు. రస్ అల్ ఖైమా క్రౌన్ ప్రిన్స్ షేక్ మహమ్మద్ బిన్ సౌద్ బిన్ సక్ర్ అల్ కస్మి, పలువురు షేక్‌లు, డైరెక్టర్స్ ఆఫ్ లోకల్ ఫెడరల్ డిపార్ట్మెంట్స్, అరబ్ ప్రతినిథులు, ఈ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. పశ్చిమ విభాగానికి చెందిన పాలక ప్రతినిథులు షేక్ హమదాన్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కసర్ లివా మసీదు వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. శ్రేయోభిలాషుల నుంచి శుభాకాంక్షలు అందుకుంటారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







