బ్యాంకు ఖాతాదారులకు గుడ్‌న్యూస్

- March 07, 2017 , by Maagulf
బ్యాంకు ఖాతాదారులకు గుడ్‌న్యూస్

కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంతో సామాన్యుడికి పట్టపగలే చుక్కలు కనిపించాయి. ఆ నోట్ల రద్దు వల్ల ఒరిగిన ప్రయోజనమేమీ లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడిప్పుడే ఆ గాయాలు మానుతున్న నేపథ్యంలో బ్యాంకులు తీసుకున్న నిర్ణయం మానుతున్న పుండును గిల్లి కారం చల్లినట్లయింది. నోట్ల రద్దు సమయంలో ఏటీఎంల ముందు డబ్బులు తీసుకునేందుకు పడిగాపులు కాచిన సామాన్యుడు, ఇప్పుడా ఏటీఎం వైపు వెళ్లాలంటేనే భయపడుతున్నాడు. బ్యాంకులు తీసుకున్న అడ్డగోలు నిర్ణయాలే ఇందుకు కారణం. బ్యాంకులో డబ్బులు వేసినా, తీసినా చార్జీలు వసూలు చేయడంపై సామాన్యుడు కారాలుమిరియాలు నూరుతున్నాడు. అయితే ఈ బ్యాంకుల బాదుడు నుంచి తప్పించుకునే మార్గం ఒకే ఒక్కటి.
అదే ఆధార్ ఆధారిత యాప్ ద్వారా నగదు చెల్లింపులు. ఆధార్ పే యాప్ ద్వారా నగదు చెల్లింపులపై ఎలాంటి చార్జీలు ఉండవు. ఈ ఆండ్రాయిడ్ ఆధారిత యాప్‌ను ఐడీఎఫ్‌సీ బ్యాంకు ఆవిష్కరించింది. ఈ యాప్ ఉంటే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఏదీ అవసరం లేదు.

దుకాణదారుడు ఈ యాప్‌ను స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు. దాన్ని బయోమెట్రిక్ లేదా ఫింగర్‌ప్రింట్ స్కానర్‌కు కనెక్ట్ చేయాలి. కొనుగోలుదారుడు తన ఆధార్ నంబర్‌ను అందులో నమోదు చేసి, బ్యాంకును సెలెక్ట్ చేసుకుంటే చాలు. ఇక నగదు చెల్లించడమే తరువాయి.

ఈ యాప్ ద్వారా చెల్లింపులు జరిపితే ఎలాంటి ట్రాన్షాక్షన్ ఫీజులు ఉండవు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com