పనిమనిషిని గుర్తుపెట్టుకున్న మానవత్వం
- March 10, 2017
భారతీయ పనిమనుషులను కుక్కల్లాగా చూస్తారని అపఖ్యాతి పొందిన సౌదీ అరేబియాలో తన ఇంట్లో ఎన్నడో పనిచేసిన ఒక పనిమనిషికోసం దేశం దాటి ప్రయాణించిన సౌదీ మహిళ గురించి వింటుంటే మానవత్వం ఎడారి నేలలో కూడా అరుదుగానైనా మోసులెత్తుతోందని అనిపించక మానదు. సౌదీలో ఇంట్లో పనిమనుషులుగా చేసేవారు చిత్రహింసలను ఎదుర్కొంటున్నట్లు ఎన్నో వార్తలు చదివి ఉంటారు. అక్కడ చట్టాలు కూడా సౌదీ పౌరులకు అనుకూలంగానే ఉంటాయి. యజమాని ఒప్పుకోనిదే వేరే చోట పనిచేయకూడదు. అసలు దేశం కూడా దాటనివ్వరు. చాలామంది యజమానులయితే పనిమనుషులను ఓ బానిసలా చూస్తుంటారు.
వీళ్లలాగానే.. పనిమనుషులను తమ ఇంటివారిలాగా చూసుకునేవారు కూడా ఉంటారు. తమ ఇంట్లో పనిచేసిన మహిళను గుర్తు పెట్టుకుని మరీ చూసేందుకు వెళ్లింది.
యోగక్షేమాలను కనుక్కుంది. అయితే ఆమె ఏ పక్క ఊరికో వెళ్లిందనుకుంటే పొరపాటే.. కేవలం పనిమనిషిని చూసేందుకు సౌదీ నుంచి శ్రీలంకకు ప్రయాణం చేసిందంటే ఆమెను నిజంగానే మెచ్చుకోవలసిందే మరి.
విషయంలోకి వస్తే... శ్రీలంకకు చెందిన సరోనా 1989లో సౌదీ నివాసి అబ్దుల్అజీజ్ ఖలీఫా అల్ జక్రీ అనే వ్యక్తి ఇంట్లో పనిచేయడానికి వెళ్లింది. వారి కుటుంబంలో ఒకరిగా కలిసిపోయింది. జక్రీ కుటుంబంలో చాలా మంది సభ్యులున్నారు. ఆయన అన్నదమ్ములు వారి పిల్లలు అందరు ఒకే ఇంట్లో ఉంటారు. అంతమంది ఉన్నా.. ఆ ఇంట్లో అందరి అవసరాలేంటో సరోనాకే బాగా తెలుసు. ఎవరికి ఏం కావాలన్నా సరోనానే అడిగేవారు.
అయితే కొన్ని సంవత్సరాల తర్వాత వారు కొత్త ఇల్లు కట్టుకుని అందులోకి మారారు. వారితోపాటు కొత్తింట్లో అడుగుపెట్టిన సరోనాకు దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగింది. మేడపై నుంచి కింద పడి ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. కొన్ని రోజుల్లోనే ఆమె ఆరోగ్యం కుదుటపడింది. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఆమె స్వదేశమయిన శ్రీలంకకు పంపించారు.
సాధారణంగా అయితే ఇంట్లో పనిమనిషి మానేస్తే.. వాళ్లను ఎవరూ గుర్తుపెట్టుకోరు. కొత్త పనిమనిషిని పెట్టుకుని తమ అవసరాలను తీర్చుకుంటుంటారు. కానీ జక్రీ కుటుంబం అందుకు అతీతం.. ఫోన్ ద్వారా ఆమె ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారు. అంతేకాకుండా ఆమెకు ఆర్థికంగా కూడా సహయపడుతున్నారు. ఆమె పిల్లలను కూడా వారి సొంత ఖర్చులతో చదివిస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం జాక్రీ భార్య శ్రీలంకకు వచ్చి సరోనాను పరామర్శించి వెళ్లింది. అన్ని విషయాల్లో అండగా ఉంటామని ఆమెకు భరోసా కల్పించారు. ఏదిఏమైనా ఇలాంటి వ్యక్తులు ఉండటం చాలా అరుదే అని చెప్పుకోవాలి.
పనిమనుషుల పట్ల కరుణ లేని గల్ఫ్ భూమిలో కృతజ్ఞతను ప్రదర్శించేవారు కూడా ఉంటారని ఇప్పుడే వింటున్నాం కదూ..
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







