ప్రమాదానికి గురైన వారి ఫోటోలను పంచినవారు శిక్షార్హులు

- March 10, 2017 , by Maagulf
ప్రమాదానికి గురైన వారి ఫోటోలను పంచినవారు శిక్షార్హులు

" ఇల్లు తగలబడి  ఒకరు ఏడుస్తుంటే ..చుట్టకు నిప్పు అడిగినట్లుగా "  ఎక్కడైనా ప్రమాదం జరిగితే బాధితుల గోడును పట్టించుకోకుండా  వారిని సెల్ ఫోన్లలో ఫోటోలు... వీడియోలను తీయడం క్షణాల్లో వేరే వారికి పంపడం ...సామాజిక మాధ్యమాలలో వాటిని పోస్ట్ చేయడం ఇటీవల అధికమైంది. ...బహుశా ఇటువంటి విషయాలను దృష్టిలో ఉంచుకొని కాబోలు  శ్రీశ్రీ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ జారీచేసిన కొత్త చట్టం ఆ చేష్టలకు అడ్డుకట్ట వేయనుంది. మరియు ప్రమాద బాధితుల యొక్క చిత్రాలు  క్లిక్ చేసినా  మరియు వీడియోలు రికార్డింగ్ చేసి వాటిని వేరేవారికి భాగస్వామ్యం చేస్తూ పంపినట్లైతే ,ఆ నేరానికి  రెండు సంవత్సరాల జైలుశిక్ష  మరియు ఐదువేల ఖతార్ రియాళ్ళ నుంచి 10,000 ఖతార్ రియాళ్ళ వరకు జరిమానావిధిస్తారు. శుక్రవారం , శ్రీశ్రీ  ఎమిర్  పీనల్ కోడ్, చట్టం సంఖ్య 11 2004 లో సవరణలను చేశారు. దీని ప్రకాయం  చట్టబద్ధంగా అనుమతి ఉన్న.వారు మినహా గోప్యతా ఉల్లంఘిస్తే  వారిని  శాసన నిబంధనలను మరియు జరిమానాలకు  అమలుచేస్తుంది వ్ పీనల్ కోడ్, ఆర్టికల్ 333 ప్రకారం కొన్ని నిబంధనలకు సవరణల 2017 లా నంబర్ 4 జారీ చేయబడింది. బాధితుల  అనుమతి లేకుండా వ్యక్తులు ఫోటోలు వీడియోలు తీయరాదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com