ఎంప్లాయ్‌మెంట్‌ వీసా కోసం ఫోర్జరీ

- March 11, 2017 , by Maagulf
ఎంప్లాయ్‌మెంట్‌ వీసా కోసం ఫోర్జరీ

ఎంప్లాయ్‌మెంట్‌ వీసా కోసం ఆస్ట్రేలియన్‌ ఎంబసీకి ఫోర్జరీ సర్టిఫికెట్‌ని పంపించాడో ప్రబుద్ధుడు. దుబాయ్‌కి చెందిన వ్యక్తిగా అతన్ని గుర్తించారు. 38 ఏళ్ళ ఈజిప్టియన్‌ ఇంజనీర్‌, ఈ నేరానికి పాల్పడ్డాడు. నఖీల్‌ జారీ చేసిన పత్రంగా ఓ నకిలీ పత్రాన్ని అతను సృష్టించడం జరిగింది. ఇ-మెయిల్‌ ద్వారా దాన్ని ఆస్ట్రేలియా ఎంబసీకి పంపించి, వీసా కోసం అప్లయ్‌ చేశాడు. గత ఏడాది జూన్‌ 8 న ఈ ఘటన జరిగింది. ఆస్ట్రేలియా ఎంబసీ నుంచి అందిన సమాచారంతో నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. పోలీసులు విచారణ పూర్తి చేసి, న్యాయస్థానం ముందు నిందితుడ్ని నిలబెట్టారు. మార్చ్‌ 21న ఈ కేసు విచారణకు రానుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com