సౌదీ అరేబియాలో తీవ్రవాది హతం
- March 11, 2017
భద్రతాదళాలు ఈస్టర్న్ ప్రావిన్స్‌లో తీవ్రవాది ముస్తఫా అల్ మదాద్‌ని మట్టుబెట్టాయి. ఖాతిఫ్‌లో అల్ షాకియా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అల్ మదాద్ దేశ వ్యతిరేక శక్తిగా గత కొంతకాలంగా తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. భద్రతాదళాలకు తీవ్రవాది ఎదురుపడ్డ సందర్బంలో అతన్ని లొంగిపోవాల్సిందిగా చేసిన హెచ్చరికల్ని బేఖాతరు చేశాడు. భద్రతాదళాలపైకి తీవ్రవాది కాల్పులు జరిపాడు. తిరిగి భద్రతాదళాలు కాల్పులు జరపడంతో, అల్ మదాద్ మృతి చెందాడు. ఈ ఘటనలో భధ్రతా దళాలకు సంబంధించిన ఒకరు గాయాల పాలయ్యారు. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన ప్రాంతంలో ఇంకా తీవ్రవాదులున్నారేమో అన్న కోణంలో భద్రతాదళాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. తీవ్రవాదులకు సంబంధించిన సమాచారంగానీ, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్‌కి సంబంధించిన సమాచారంగానీ 990 నెంబర్‌లో తెలిజేయవచ్చుననీ, ఖచ్చితమైన సమాచారం ఇచ్చినవారికి ప్రోత్సాహకాలు ఉంటాయి ఇంటీరియర్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ మేజర్ జనరల్ మన్సౌర్ అల్ టుర్కి చెప్పారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







