హీరోయిన్ ను పెళ్లాడుతున్న వరుణ్ సందేశ్ !
- September 24, 2015
హ్యాపీడేస్, కొత్త బంగారు లోకం సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న స్టార్ వరుణ్ సందేశ్. ఆ తర్వాత చాలా సినిమాలు చేసినా వరుణ్ సందేశ్ కి సరైన హిట్టు మాత్రం లేదు. దీంతో సినిమా అవకాశాలు కూడా చాలా వరకు తగ్గాయి. ఆ సంగతి పక్కన పెడితే త్వరలో వరణ్ సందేశ్ పెళ్లి చేసుకోవడానికి సిద్దమవుతున్నాడు. తనతో పాటు 'పడ్డానండీ ప్రేమలో మరి' చిత్రంలో నటించిన వితికా షేరుతో ప్రేమ వ్యవహారం నడుపుతున్న వరుణ్ సందేశ్ ఆమెను పెళ్లాడేందుకు రెడీ అయ్యాడు. ఇద్దరూ తమ ప్రేమ వ్యవహారం విషయాన్ని పెద్దలకు చెప్పి ఒప్పించారని తెలుస్తోంది. త్వరలోనే నిశ్చితార్థం, పెళ్లి విషయమై ప్రకటన రానుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'హ్యాపీ డేస్' చిత్రం భారీ విజయం సాధించడంతో వరుణ్ సందేశ్ మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత వచ్చిన 'కొత్త బంగారు లోకం' కూడా హిట్ కావడంతో వరుణ్ కి అవకాశాలు వెల్లువెత్తాయి. అయితే ఆ తర్వాత వరుణ్ సందేశ్ చేసిన సినిమాలన్నీ దాదాపుగా పరాజయం పాలయ్యాయి. పెళ్లి తర్వాత అయినా వరుణ్ సందేశ్‌కి లక్కు కలిసొస్తుందో? లేదో? వెయిట్ అండ్ సీ
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







