మక్కా లో తొక్కిసలాట... మృతుల్లో భారతీయులు...అందులో ఒక హైదరాబాది
- September 24, 2015
పవిత్ర హజ్ యాత్రలో చోటుచేసుకున్న పెను విషాదఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తొలుత 150 మంది యాత్రికులు మరణించారని వెల్లడించిన మక్క మసీదు అధికారులు.. తాజాగా అందుకు రెట్టింపు సంఖ్యలో 450 మంది పైగా మరణించినట్లు వెల్లడించారు. మక్కా మసీదు వెలుపల ఐదు కిలోమీటర్ల దూరంలోని మీనా ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో 13 మంది భారతీయులు కూడా ఉన్నట్లు అనధికార వర్గాల నుంచి వెలువడిన సమాచారం. కాగా ఎంత మంది గాయపడ్డార్న వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. అయితే మృతుల్లో అధికంగా ఆఫ్రికా, ఇరాన్ దేశానికి చెందిన యాత్రికులే వున్నారని తెలుస్తోంది.
క్షతగాత్రులను వివిద అసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్న నేపథ్యంలో గాయపడిన వారి వివరాల వెల్లడించేందుకు సమయం పడుతుందని అక్కడి అధికారులు తెలిపారు. మొత్తం 1,36,000 పైచిలుకు మంది యాత్రికులు భారత్ నుంచి ఈ ఏడాది హజ్ యాత్రకు వెళ్లారని కాగా, ఇవాళ సంభవించిన విషాధఘటనలో 13 మంది భారతీయులున్నారని సమాచారం.
హజ్ యాత్రలో గడచిన 25 ఏళ్లలో 2,700 మంది చనిపోయారు. 1990 నుంచి ఇప్పటివరకూ మొత్తం 2,778 మంది ప్రాణాలు కోల్పోయారని ఖలీజ్ టైమ్స్ తెలిపింది. 2006 జనవరి 12న హజ్ యాత్ర చివరి రోజున జరిగిన తొక్కిసలాటలో 346 మంది చనిపోయారు. 2004 ఫిబ్రవరి ఒకటిన సైతాన్‌పై రాళ్లు విసిరిన ఘటనలో జరిగిన తొక్కిసలాటలో 250 మంది ప్రాణాలు కోల్పోయారు. 2003 ఫిబ్రవరి 11న సైతాన్‌పై రాళ్లు విసిరిన ఘటనలో 15 మంది చనిపోయారు. 1998 ఏప్రిల్ 9న జమారత్ వంతెన వద్ద జరిగిన ప్రమాదంలో 118 మంది ప్రాణాలు విడిచారు. 1994 మే 23న సైతాన్‌పై రాళ్లు విసిరిన ఘటనలో తొక్కిసలాట జరిగి 270 మంది చనిపోయారు. 1990 జులై రెండున మక్కా నుంచి మీనా వెళ్లే దారిలో జరిగిన తొక్కిసలాటలో 1,426 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







