దుబాయ్‌ క్రీక్‌, దుబాయ్‌ వాటర్‌ కెనాల్‌ ఈదిన తొలి సౌదీ మహిళ

- March 13, 2017 , by Maagulf
దుబాయ్‌ క్రీక్‌, దుబాయ్‌ వాటర్‌ కెనాల్‌ ఈదిన తొలి సౌదీ మహిళ

సౌదీ డెంటిస్ట్‌, హ్యుమానిటేరియన్‌ డాక్టర్‌ మరియమ్‌ సలెహ్‌ బిన్‌లాడెన్‌, దుబాయ్‌ క్రీక్‌ని అలాగే దుబాయ్‌ కెనాల్‌నీ దాటిన తొలి సౌదీ మహిళగా రికార్డులకెక్కారు. మొత్తం 24 కిలోమీటర్ల మేర ఆమె ఈ సాహసం చేయడం గమనించదగ్గది. మార్చ్‌ 10న ఈ అద్భుతాన్ని ఆమె తన ఖాతాలో వేసుకున్నారు. దుబాయ్‌ స్పోర్ట్స్‌ కౌన్సిల్‌, దుబాయ్‌ మెరిటైమ్‌ అథారిటీ, దుబాయ్‌ రోడ్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ, దుబాయ్‌ పోలీస్‌, మెరైన్‌ రెస్క్యూ సంయుక్తంగా నిర్వహించిన స్పెషల్‌ ఈవెంట్‌ ద్వారా దుబాయ్‌ క్రౌన్‌ ప్రిన్స్‌, దుబాయ్‌ స్పోర్ట్స్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ షేక్‌ హమమదాన్‌ బిన్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌ ఈ అద్భుతాన్ని తిలకించారు. ఉదయం 5 గంటల సమయంలో డాక్టర్‌ మరియం ఈ సాహసాన్ని ప్రారంభించారు. మధ్యాహ్నం 2.10 నిమిషాలకు ఆమె తన సాహసాన్ని పూర్తి చేశారు. మొత్తం 9 గంటల 10 నిమిషాలపాటు ఈ సాహసం కొనసాగింది. ఈ సందర్బంగా డాక్టర్‌ మరియమ్‌ని పలువురు ప్రముఖులు అభినందించారు. ఆమె తెగువని కొనియాడారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com