ఒమాన్ లో కార్మిక చట్టంను ఉల్లంఘించిన 500 మంది అరెస్ట్

- March 13, 2017 , by Maagulf
ఒమాన్ లో కార్మిక చట్టంను ఉల్లంఘించిన 500 మంది అరెస్ట్

మస్కట్  : కార్మిక చట్టంను ఉల్లంఘించిన 500 మంది కంటే ఎక్కువ మందిని వారాంతపు తనిఖీలో భాగంగా మానవ వనురుల మంత్రిత్వశాఖ అరెస్టు చేశారు. మార్చి 5 వ తేదీ నుండి మార్చి 11 వ తేదీ మధ్య కాలంలో మంత్రిత్వ శాఖ సంయుక్త తనిఖీ జట్టు,భద్రతా సిబ్బంది సహకారంతో ఈ దాడులు నిర్వహించారు. ఆ కాలంలో 548 మంది కార్మిక చట్టంఉల్లంఘించిన వారిని అరెస్ట్ చేశారు. వీరిలో 412 మంది వాణిజ్య కార్మికులు, 62 మంది రైతులు, 74 మంది ఇళ్లలో పనిచేసే దేశీయ కార్మికులు ఉన్నారు. అదేవిధంగా మంత్రిత్వ శాఖ  జట్టు, 509 మందిపై నేర పరిశోధన జరిపే నిమిత్తం అరెస్టు చేశారు. వీరిలో 310 మంది వారి యజమానులు నుండి పరారైన వారు కాగా,176 మందిని విడుదల చేయగా,23 మంది చట్టపరమైన పత్రాలను తమ వెంట ఉంచుకోనందున అరెస్ట్ చేయబడ్డారు .మస్కట్ గవర్నేట్ పరిధిలో145 మందిని అరెస్టు చేయడంతో అది అత్యధిక సంఖ్యగా నమోదు కాబడింది. ఆ తర్వాత  ఉత్తర అల్ బత్తినహ గవర్నేట్ పరిధిలో127 మంది నమోదు కాబడ్డారు. ఇందుకు బాధ్యులైన అధికారులు అవసరమైన చట్టబద్ధమైన ప్రక్రియలు తీసుకున్నట్లు తెలిపారు.ఇదే కాలంలో కార్మిక చట్టంని ఉల్లంఘించిన 451మందిని ఆయా దేశాల  రాయబార కార్యాలయాలు తో అప్పగించి ఆ తరువాత దేశము నుండి వారిని బహిష్కరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com