హాలు ఒబ్బట్టు
- March 13, 2017
కావలసిన పదార్థాలు: గోధుమ పిండి, పాలు- ఒకటిన్నర కప్పు, మైదాపిండి- అరకప్పు, నెయ్యి- రెండు టేబుల్‌స్పూన్లు, ఉప్పు- చిటికెడు, గసగసాలు- రెండు టేబుల్‌స్పూన్లు, కిస్మిస్, జీడిపప్పు, బాదం పప్పు- ఒక్కో టేబుల్‌స్పూను చొప్పున, పచ్చి కొబ్బరి తురుము- ఒక కప్పు, ఎండుకొబ్బరి తురుము- ఒకటేబుల్స్పూను, యాలకలు- నాలుగు, బెల్లంపొడి- ముప్పావు కప్పు, నూనె- తగినంత
తయారీ విధానం: ఒక గిన్నెలో గోధుమపిండి, మైదా, ఉప్పు, కొద్దిగా నెయ్యి తీసుకొని నీళ్లు పోస్తూ పూరీ పిండిలా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఇరవై నిమిషాలపాటు నాననివ్వాలి. తరువాత ఉండలు చేసి పూరీల్లా వత్తాలి. వీటిని నూనెలో డీప్ప్రై చేయాలి. పాన్‌లో గసగసలాను గోధుమరంగులోకి వచ్చే వరకు వేగించాలి. చల్లారిన గసగసాలు, కొబ్బరి తురుము, బాదం, యాలకలను కలిపి పొడి చేసి కొద్దిగా నీళ్లు పోసి గుజ్జులా చేసుకోవాలి. పాన్‌లో ఒక కప్పు నీళ్లు పోసి బెల్లం వేసి అది కరిగేవరకు వేడి చేయాలి. తరువాత దీనిలో గసగసాల మిశ్రమం, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలపాలి. కొద్దిసేపటి తరువాత పాలుపోయాలి. ఈ మిశ్రమాన్ని సన్నటిమంటపై పదినిమిషాలపాటు ఉడికించాలి. వేగించిన జీడిపప్పు, కిస్మిస్లు వేసిన ఈ పాయసాన్ని పూరీలపై పోసి సర్వ్ చేయాలి. ఇది కర్నాటక వారు సంక్రాంతికి వండుకునే ప్రత్యేక వంటకం.
తాజా వార్తలు
- ఖతార్ లో ఉపాధ్యాయులకు సామర్థ్య పరీక్షలు..!!
- కువైట్ లో పొగమంచు, రెయిన్ అలెర్ట్ జారీ..!!
- ముగిసిన రెడ్ వేవ్ 8 నావల్ డ్రిల్..!!
- దుబాయ్ లో T100 ట్రయాథ్లాన్..ఆర్టీఏ అలెర్ట్..!!
- బహ్రెయిన్ లో దీపావళి మిలన్..!!
- STPలో నీటి నాణ్యతపై అధ్యయనం..!!
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!







