చెన్నైలో క్యాట్ బిర్యానీ: రోడ్ సైడ్ షాపులు..
- September 25, 2015
చెన్నైలో రోడ్ సైడ్ అండ్ హోటల్ బిర్యానీ అంటే లొట్టలేసుకుని లాగించేసే భోజన ప్రియులకు ఓ షాకింగ్ న్యూస్. పట్టణ వాసంలో సమయం లేదనో.. వండుకునేందుకు సమయం లేదనో రోడ్ సైడ్ అంగట్లో తినేస్తే ఓ పూట గడిచిపోతే సరిపోతుందని అందరూ అనుకుంటారు. చెన్నైలో యువకులు, చిరు ఉద్యోగులు, కార్మికుల భోజన అవసరాలను తీర్చేందుకు రోడ్ల పక్కన చిన్న హోటళ్లు, మొబైల్ వ్యాన్లు, భోజనం పాయింట్లపై ఆదారపడుతున్నారు. వీరి అవసరాన్ని ఆసరా చేసుకుని పుట్టగొడుగుల్లా చిన్నతరహా క్యాంటీన్లు వెలుస్తున్నాయి. వీటిలో ఎక్కువగా అమ్ముడయ్యేది బిర్యానీ అని వ్యాపారులు అంటున్నారు. కేవలం 50 రూపాయలకే బిర్యానీ లభించడంతో దీనిని తినేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతుంటారు. అయితే ఇలా తక్కువ ధరకు లభించే బిర్యానీ చికెన్ లేక మటన్ బిర్యానీ అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. అది పిల్లి బిర్యానీ అని పోలీసులు షాకింగ్ న్యూస్ ఇచ్చారు. ఈ మధ్య చెన్నైలో పిల్లులు కనిపించడం లేదన్న ఫిర్యాదులు ఎక్కువవుతున్నాయి. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు, రాత్రిపూట రోడ్లపై నిద్రించే కొందరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పిల్లులను పట్టుకుని ఏం చేస్తున్నారని వారిని ప్రశ్నించగా, హోటళ్లకు విక్రయిస్తున్నామని సమాధానమిచ్చారు. వీటిని ఏం చేస్తారని పోలీసులు అడగగా, బిర్యానీ వండుతారని, కస్టమర్లకు వడ్డిస్తారని వారు తెలిపారు. దీంతో పోలీసులు షాక్ తిన్నారు. ఇలాంటి హోటళ్లపై దాడులు చేయాలని ఆరోగ్యశాఖను వారు కోరారు. పిల్లి మాంసం రెండు లేదా మూడు కేజీలు వంద రూపాయలు పలుకుతుందని.. ముఖ్యంగా టాస్మాక్ (మందు) షాపుల్లో క్యాట్ మీట్తో తయారైన సైడిష్లను సర్వ్ చేస్తున్నారని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







