అమెరికా లో మోడీ !
- September 25, 2015
మూడు రోజులు న్యూయార్క్‌లో, రెండు రోజులు సిలికాన్ వ్యాలీలో.. * యూఎన్ సదస్సులో ప్రసంగం; ఒబామాతో ద్వైపాక్షిక చర్చలు న్యూయార్క్: ఐర్లాండ్ నుంచి ఐదురోజుల పర్యటనకు గానూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం అమెరికా చేరుకున్నారు. ఈ ఐదు రోజుల్లో.. మొదటి రెండు రోజులు న్యూయార్క్‌లో, తరువాతి రెండు రోజులు కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీలో ఆయన ఊపిరి సలపని కార్యక్రమాల్తో బిజీబిజీగా గడపనున్నారు. చివరగా సెప్టెంబర్ 28న న్యూయార్క్‌లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో ముఖాముఖి భేటీ అయి, ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు. అనంతరం ఐరాస ఉన్నతస్థాయి శాంతి పరిరక్షక దళ సదస్సులో పాల్గొంటారు. విమానాశ్రయంలో మోదీకి అమెరికాలో భారత రాయబారి అరుణ్ కే సింగ్, ఐరాసలో భారత దౌత్యవేత్త అశోక్ ముఖర్జీ, కౌన్సుల్ జనరల్ ధ్యానేశ్వర్ మూలే తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన నేరుగా ప్రఖ్యాత వాల్డార్ఫ్ అస్టోరియా హోటల్‌కు చేరుకున్నారు. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా ప్రస్తుతం అదే హోటల్లో ఉన్నారు. హోటల్ వద్ద గుమిగూడిన అభిమానులు మోదీకి ఘన స్వాగతం పలికారు. 'అమెరికా లవ్స్ మోదీ' బ్యానర్లు ప్రదర్శిస్తూ వారు చేసిన 'మోదీ.. మోదీ' నినాదాలతో కాసేపు ఆ ప్రాంతం మార్మోగింది. దాంతో మోదీ కాసేపు వారితో గడిపి హోటల్ లోపలికి వెళ్లారు. అనంతరం, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో సమావేశమై, ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. యూఎస్‌లో మోదీ షెడ్యూల్ ఇలా.. న్యూయార్క్‌లో..: - ఐరాస సంతులిత అభివృద్ధి సదస్సులో పలువురు ప్రముఖ దేశాధినేతలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో 'యూఎన్ 2015 అనంతర అభివృద్ధి ఎజెండా'ను సభ్యదేశాలు లాంఛనంగా అంగీకరిస్తాయి. - భారత్‌లో పెట్టుబడులు పెట్టేం దుకు ఆసక్తి చూపుతున్న విదేశీ వ్యవస్థాగత పెట్టుబడిదారులతో సమావేశమవుతారు. - బ్రెజిల్, జర్మనీ, జపాన్, భారత్‌లు సభ్యదేశాలుగా ఉన్న జీ4 సదస్సులో ప్రసంగిస్తారు. ఆ దేశాల అధినేతలతో సమావేశమవుతారు. - ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండ్, భూటాన్, గయానా, సైప్రస్, స్వీడన్ దేశాధినేతలతో భేటీ అవుతారు. సిలికాన్‌వ్యాలీలో..: - ప్రముఖ కంపెనీ టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌తో కలసి ఆ సంస్థ క్యాంపస్‌ను సందర్శిస్తారు. పునర్వినియోగ ఇం దన రంగంలో ఆ సంస్థ సాధించిన విజయాల ను, చేస్తున్న కృషిని పరిశీలిస్తారు. సత్య నాదెళ్ల(మైక్రోసాఫ్ట్), సుందర్ పిచాయ్(గూగుల్), మార్క్ జుకెర్‌బర్గ్(ఫేస్‌బుక్), టిమ్ కుక్(యాపిల్), జాన్ చాంబర్(సిస్కో), పాల్ జాకోబ్స్ (క్వాల్‌కామ్), శాంతను నారాయణ్(అడోబ్) తదితరులతో డిజిటల్ టెక్నాలజీ, భారత్‌లో అవకాశాలు, స్టార్ట్ అప్స్.. తదితరాలపై చర్చిస్తారు. హా ఫేస్‌బుక్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శిస్తారు. సాన్ జోస్‌లోని సాప్ సెంటర్ లో 18 వేల మందిని ఉద్దేశించి ప్రసంగిస్తారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్







