మరో మైలురాయి రెహ్మాన్ కీర్తిసిగలో
- March 17, 2017
'వన్ హార్ట్'తో కల నెరవేర్చుకుంటున్న ఆస్కార్ విజేత
భారత తొలి ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ కీర్తిసిగలో మరో అరుదైన మైలురాయి చేరబోతోంది. ఈ ఏడాదితో 25 ఏళ్ల సంగీత ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న రెహ్మాన్ మ్యూజిక్ కన్సర్ట్ వెండితెరపై ప్రదర్శితం కాబోతోంది. దివంగత పాప్రారాజు మైఖేల్ జాక్సన్ మ్యూజిక్ షో 'దిస్ ఈజ్‌ఇట్'ను గతంలో మ్యూజికల్ మూవీగా విడుదల చేయగా, సంగీతాభిమానులు, సినీ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. అదే తరహాలోనే భారత్‌లో తొలిసారిగా ఏఆర్ రెహ్మాన్ కన్సర్ట్ను సినిమాగా విడుదల చేయబోతున్నారు. ఉత్తర అమెరికాలోని 10 నగరాల్లో నిర్వహించిన రెహ్మాన్ మ్యూజిక్ టూర్‌ను 'వన్ హార్ట్' పేరుతో వచ్చే ఏప్రిల్ మాసంలో విడుదల చేయనున్నారు.
వైఎం మూవీస్, గ్రేప్ వెంచర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించగా, టొరంటోని స్కాటియా బ్యాంక్ సినిమా హాలులో ఇదివరకే ప్రీమియర్‌ను ప్రదర్శించారు. సంగీత పరిశ్రమలోని సీనియర్లకు సాయం చేయాలన్నదే తన కలని ఎప్పుడూ చెప్పే రెహ్మాన్ 'వన్ హార్ట్' సినిమా ద్వారా నిధిని వారికే కేటాయించనున్నారు. వన్ హార్ట్ మ్యుజీషియన్స్ ఫౌండేషన్ ఒక కార్పస్ ఫండ్‌ని ఏర్పాటుచేసి సంగీత కళాకారులు, వారి కుటుంబాలను ఆదుకోనుండగా, ఈ ఫౌండేషన్‌కి రెహ్మాన్ బ్రాండ్ అంబాసడర్‌గా కూడా వున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







