10వేల డాలర్లు పలికిన బర్గర్ ధర దుబాయ్‌లో
- March 17, 2017
బర్గర్ ఖరీదు సాధారణంగా ఓ 50 రూపాయల నుంచి 100 రూపాయల వరకు ఉండొచ్చు. కానీ దుబాయ్‌లో బర్గర్ మాత్రం ఏకంగా 10 వేల డాలర్ల ఖరీదు పలికింది. అంటే మన కరెన్సీ ప్రకారం రూ.6,55,505 అన్నమాట. జ్యూసీ బర్గర్ కోసం నిర్వహించిన చారిటీ ఆక్షన్‌లో దుబాయ్ లైఫ్ స్టైల్ మ్యాగజీన్ విల్లా వ్యవస్థాపకుడు అస్మా అల్ ఫహిమ్ 10 వేల డాలర్లకు దీన్ని సొంతం చేసుకున్నారు. రెండేళ్ళ క్రితం నిర్వహించిన వేలంలో ఈ బర్గర్ 7వేల డాలర్లకు అమ్ముడుపోయింది. ఈ ఏడాది దీని ధర మరింత పెరిగింది. పింక్ క్యారవాన్ ఈ వేలాన్ని నిర్వహిస్తోంది. దీని ద్వారా సేకరించిన నగదును బ్రెస్ట్ కాన్సర్‌పై అవగాహన కల్పించడానికి వాడుతుంటారు. ఈ బర్గర్‌తో పాటు మరికొన్ని డిషెస్ కూడా వేలానికి వచ్చాయి. మొత్తంగా 29,633 డాలర్లను ఈ సంస్థ సేకరించింది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







