ఈద్ ప్రార్థనల్లో పాల్గొన్న కింగ్
- September 25, 2015
కింగ్ హమాద్ నిన్న, ఈద్ అల్ అధా సందర్భంగా సఖిర్ ప్యాలెస్ మసీదులో ప్రత్యేక ప్రార్థనలు న్విహించారు. ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా, క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ సుప్రీం కమాండర్, తొలి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, సీనియర్ రూలింగ్ కుటుంబ సభ్యులు, మంత్రులు, కువైట్ రాయబారులు మరియు అంతర్గత వ్యవహారాల శాఖ అధికారులు తదితరులు ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇమామ్, కింగ్ హమాద్‌ని అల్లా రక్షించాలనీ, ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం ఉండేలా చూడాలని, ఆయన జీవితంలో సంతోషం ఎల్ల వేలలా ఉండేలా చేయాలని, హమాద్ నేతృత్వంలో కింగ్‌డమ్ ఇంకా అభివృద్ధి చెందాలని ప్రార్థించారు. దేశం కోసం ప్రాణాలర్పించినవారి ఆత్మకు శాంతి చేకూరాలని కింగ్ హమాద్ ప్రార్థించారు. ఈద్ అల్ అధా సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపినవారికి అభినందనలు తెలియజేశారు కింగ్ హమాద్.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







