చెల్లాచెదురుగా మృతదేహాలు 13మంది మృతి, ఘోర రోడ్డు ప్రమాదం
- March 18, 2017
కర్ణాటకలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతిచెందారు. చిత్ర దుర్గ జిల్లా ఎలే రాంపుర వద్ద 9వ నెంబర్ జాతీయ రహదారిపై రెండు ఆటోలు, టెంపో ట్రావెలర్‌ను లారీ ఢీకొంది.
ఘటనా స్థలంలోనే 11 మంది కూలీలు మృతి చెందారు. మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదరుగా పడివున్నాయి. ప్రమాదంలో మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆటోలోని వారంతా విజయపుర జిల్లాకు చెందిన కార్మికులుగా గుర్తించారు. బెంగళూరు నుంచి స్వగ్రామానికి వెళుతుండగా ఘటన చోటు చేసుకుంది.
వేగంగా వస్తున్న లారీ టైరు పగిలి అదుపుతప్పి రెండు ఆటోలు, టెంపో ట్రావెలర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
కాగా, చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు. మృతదేహాలను రాంపూర ఆస్పత్రిలో ఉంచినట్లు చెప్పారు. ఘటనపై కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







