హైదరాబాదీకి కీలక బాధ్యతలు హ్యూస్టన్‌లో

- March 18, 2017 , by Maagulf
హైదరాబాదీకి కీలక బాధ్యతలు హ్యూస్టన్‌లో

ప్రజాపనుల విభాగం సారథిగా కరుణ్‌ శ్రీరామ
హ్యూస్టన్‌, మార్చి 18: హ్యూస్టన్‌ ప్రజాపనులు, ఇంజనీరింగ్‌ విభాగం(పీడబ్ల్యూడీ) డైరెక్టర్‌గా భారత అమెరికన్‌ ఇంజనీర్‌ కరుణ్‌ శ్రీరామ(53) నియమితులయ్యారు. హైదరాబాద్‌కు చెందిన ఆయన.. 4 వేల మంది ఉద్యోగులున్న పీడబ్ల్యూడీ విభాగం బాధ్యతలను వచ్చే నెల 3న చేపట్టనున్నారు.
పీడబ్ల్యూడీ డైరెక్టర్‌గా శ్రీరామను నియమిస్తూ మేయర్‌ సిల్విస్టర్‌ టర్నర్‌ ఆదేశాలిచ్చారు. ఈ పదవికి ఎంపికైన తొలి ఆసియన్‌గా శ్రీరామ రికార్డుల్లో కి ఎక్కనున్నారు. అమెరికాలో పలు కీలక ప్రాజెక్టులను చేపట్టిన ఆయనకు ఈ రంగంలో 28 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సివిల్‌ ఇంజనీరింగ్‌ డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com