భారత్ దేశం లో భక్తి శ్రద్ధలతో బక్రీద్
- September 26, 2015
బక్రీద్ పండుగను జిల్లాలోని ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. పేదలు, బంధువులకు మాంసంతో చేసిన వంటకాలను అందించారు. అల్లా ప్రసన్నుడైన దినంగా చెప్పుకునే బక్రీద్ వేడుకల్లో పిల్లలు, పెద్దలు అన్న తేడా లేకుండా ఈద్ ముబాకర్ అంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పవిత్రమైన హృదయంతో అల్లాను ప్రార్థించి ముక్తిని ప్రసాదించమని వేడుకున్నారు. త్యాగాలకు ప్రతీకైన బక్రీద్ ప్రాశస్త్యాన్ని మత పెద్దలు, గురువులు వివరించారు. త్యాగనిరతి, సేవ, భక్తి భావానికి ప్రతీక అయిన 'ఈదుల్ అజ్ఉహా' బక్రీద్ పర్వదినాన్ని జిల్లాలోని ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఇబ్రహీం, ఇస్మాయిల్ త్యాగానికి అల్లాః ప్రసన్నుడైన పవిత్రదినాన పేదలకు, తమ బంధువులకు విందు ఇచ్చారు. ఉదయం నుంచే మసీదులు కిక్కిరిశాయి. కొత్త బట్టలు ధరించి చిన్నాపెద్దా తేడా లేకుండా పవిత్ర హృదయంతో అల్లాఃను ప్రార్థించారు. జిల్లాలోని ముఖ్య నాయకులు ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి







