కొన్ని బ్యూటీ టిప్స్!!

- April 21, 2015 , by Maagulf
  1. కంటి మేకప్ తుడుచుకోటానికి రోజ్ వాటర్ లో ముంచిన నూలుబట్ట ఉపయోగించాలి. నెమ్మదిగా వత్తుతూ తుడవాలి. కనురెప్పల చివర్లజాగ్రత్తగా తుడవాలి.
  2. కొవ్వొత్తి వెలుతురులో ప్రతిరోజూ మెడిటేషన్ చేసుకుంటే మనసుకే కాకుండా కంటికి కూడా ప్రశాంతత చేకూరుతుంది
  3. పొగ త్రాగటం వలన విటమిన్ "సి" లోపించి కళ్ళ చుట్టూ నల్లని చారలు ఏర్పడగలవు.
  4. పెంపుడు జంతువుల చేష్టలను ఆలోచిస్తూ నిద్రపోతే మంచి నిద్రపడుతుంది.
  5. నిద్రకు ముందు గ్లాసు గోరువెచ్చని పాలు త్రాగిన మంచి నిద్ర పడుతుంది.
  6. దోసకాయ ముక్కలు మూసిన కనులపై వుంచుకొని కనులకి కాంతిని ఇవ్వగలవు.
  7. వేడినీటిలో ఒక చెంచా సాల్ట్ కలిపి నూలు గుడ్డ ముంచి పిండి కనురెప్పలపై వుంచిన కళ్ళవాపు తగ్గగలదు.
  8. సిట్రస్ జాతి ఫలాలు అంటే నిమ్మ లాంటివి డైరెక్ట్ గా ముఖం పై రాయకూడదు.పాలల్లో కలిపి రాసుకోవాలి.
  9. చలికాలం లో అంతగా దాహం వేయదు అలా అని శరీరానికి నీళ్ళ అవసరం లేదనుకుంటే పొరపాటు. ఈ కాలం లో కూడా రోజుకి కనీసం 7-8 గ్లాసుల నీరు తాగాలి. చర్మానికి మంచి నిగారింపు నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం పై కూడా ఆధారపడి ఉంటుంది.
  10. చర్మాన్ని తెల్లగా, మెత్తగా తయారు కావాలంటే ఓట్ మీల్ పిండి పెరుగు కలిపి ముఖం పై ప్యాక్ లా వేసుకుని 20 నిమిషాలు తర్వాత గోరువెచ్చని నీళ్ళతో ముఖాన్ని కడుక్కోవాలి.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com