కార్ పూల్ కోసం ఆర్టీఏలో రిజిస్టర్ చేసుకోండి
- September 26, 2015
కార్పూలింగ్ కోసం క్లాసిఫైడ్స్ని ఆశ్రయిస్తుంటారు. ఇలా చేయడం ద్వారా అక్రమార్కులకు అవకాశం కల్పించినట్లవుతుంది. రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టీఏ)కి చెందిన షేర్క్ని డ్రైవర్లు మరియు ప్యాసింజర్లను అనుసధానం చేసే సురక్షితమైన వేదిక. ఇందులో తమ పేర్లను నమోదు చేసుకోవడం ద్వారా వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణించే ఖర్చుని తగ్గించుకోవడమే కాకుండా, కాలుష్య నివారణకు కూడా సహకరించినట్లవుతుంది. కారు సొంతదారుకీ, ప్రయాణీకులకీ మధ్య ఎలాంటి నగదు లావాదేవీలకూ ఆస్కారం వుండదు ఈ విధానంలో. షేర్క్ని వెబ్సైట్లో దీనికి సంబంధించి పూర్తి గైడ్లైన్స్ని పొందుపర్చారు. ఈ వెబ్సైట్లో పొందే సభ్యత్వం ఆరు నెలలపాటు అమల్లో వుంటుంది. 24 గంటల వినియోగదారుల సహాయం కోసం ఓ టీమ్ కూడా పనిచేస్తుంది. ఎక్కడైనా అనుమానాస్పదంగా ఏ ప్రకటన కన్పించినా, వెంటనే దాన్ని తొలగించి, వినియోగదారులకు తగిన సమాచారం అందించడం కూడా జరుగుతుందని కస్టమర్ సపోర్ట్ బాధ్యుడు ఇబ్రహీస్ సెక్సెక్ వెల్లడించారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







