భారత్ దేశానికి చోటు కల్పించాలి-నరేంద్ర మోది
- September 26, 2015
ఐక్యరాజ్యసమితిలోని కీలకమైన విభాగమైన భద్రతామండలిలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ కు చోటు కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. జీ4 దేశాల సదస్సు శనివారం న్యూయార్క్ లో ప్రారంభమైంది. ఈ సమావేశంలో మోదీ ప్రసంగిస్తూ ఐరాసలో సంస్కరణలు వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. నిర్దిష్ట కాలపరిమితిలో ఐరాస సంస్కరణలు అమల్లోకి తేవాలని ఆయన అన్నారు. తీవ్రవాదం, పర్యావరణ కాలుష్యం ప్రపంచానికి పెనుసవాళ్లు విసురుతున్నాయని మోదీ వ్యాఖ్యానించారు. ప్రపంచ శాంతికి జీ4 దేశాలు కట్టుబడి ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ దేశాలను కలుపుకోవాలని...పొంచి ఉన్న సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకుపోవాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







