ఒమన్‌లో భారీ వర్షాలు
- March 21, 2017
మస్కట్: భారీ వర్షాలు, మస్కట్ గవర్నరేట్ పరిధిలో ముంచెత్తుతున్నాయి. నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని ఒమన్ మెటియరాలజీ డిపార్ట్మెంట్ ఆదివారమే హెచ్చరికలు జారీ చేసింది. మబెలా, బర్కా, ముసానాల్లో మంగళవారం ఉదయం భారీ వర్షాలు నమోదయినట్లు మెటియరాలజీ డిపార్ట్మెంట్ అధికారి ఒకరు వెల్లడించారు. మస్కట్ పరిధిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనీ, అలాగే సౌత్ అల్ షక్రియా, అల్ వుస్తా, దోఫార్ గవర్నరేట్ పరిధిలోనూ వర్షాలు కురుస్తాయని ఆయన చెప్పారు. మస్కట్ మరియు రువీ ప్రాంతాల్లోనూ వర్షం ఇప్పటికే కురిసింది. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ యావియేషన్, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వర్షాల కారణంగా ఒమన్‌లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి.
తాజా వార్తలు
- ఫుట్‌బాల్ మ్యాచ్‌లో తూటాల వర్షం..11 మంది మృతి
- టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల..
- అమెజాన్: 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్
- భారత్-ఈయూ వాణిజ్య ఒప్పందం
- అమెరికాలో మంచు తుఫాన్.. 29 మంది మృతి
- ఖతార్ లో ఆకట్టుకున్న ఫుడ్ ఫెస్టివల్ 2026..!!
- సౌదీ స్పెషల్ టాలెంట్ ప్రీమియం రెసిడెన్సీ..3,484 సంస్థలకు ఆమోదం..!!
- ఒమన్ లో పెరిగి చలిగాలుల తీవ్రత..!!
- కువైట్ లో భద్రత బలోపేతం..BMW పెట్రోల్ వాహనాలు..!!
- గల్ఫ్‌ఫుడ్ 2026ను సందర్శించిన షేక్ మొహమ్మద్..!!







