టీ తాగు హాయ్ హాయ్... మతిమరుపు నై నై..
- March 21, 2017
టీ కెటిల్ నుంచి వస్తున్న కమ్మని వాసనను ఆఘ్రాణిస్తూ... గుక్క గక్కనూ ఆస్వాదిస్తూ తాగండి. అది బ్లాక్ టీ గానీ, గ్రీన్ టీ లేదా సాధారణ చాయ్ గానీ.... క్రమం తప్పకుండా టీ తాగేవారిలో 50 శాతం మందికి డిమెన్షియా వచ్చే అవకాశాలు చాలా తక్కువంటున్నారు పరిశోధకులు. టీ ఆకుల్లో ఉండే క్యాటెచిన్స్, థియాఫ్లేవిన్స్ పోషకాల వల్ల మెదడు కణాలపై పడే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ ప్రభావాలతో మెదడులో వాస్క్యులార్ డ్యామేజీ, న్యూరోడీజెనరేషన్ తగ్గుతాయని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్‌కు చెందిన డాక్టర్ ఫెంగ్ లీ పేర్కొంటున్నారు.
అందుకే ఇకపై మతిమరపు, డిమెన్షియా, అలై్జమర్స్, పార్కిన్‌సన్స్ డిసీజ్ వంటి వ్యాధులకు దూరంగా ఉండాలనుకునేవారు కాస్త చాయ్‌పై ప్రేమ పెంచుకుంటే అది మతిమరపును ‘ఛేయ్’ అంటూ దూరంగా తరమేస్తుందంటున్నారు ఈ పరిశోధలకు నేతృత్వం వహించిన డాక్టర్ ఫెంగ్ లీ! కాకపోతే ఒక షరతు.... ఈ చాయ్ జాయ్ హాయ్‌లు రోజుకు మూడు కప్పులకు మించకూడదంటూ పరిమితి పెడుతున్నాడు డాక్టర్ లీ!!
జీవితంలో మతిమరపు రాకూడదని తలుస్తున్నారా జ్ఞాపకశక్తిని మెదడులోనే ఉండిపొమ్మని పిలుస్తున్నారా.. మీ సంకల్పం నేరవేరుగాక. జ్ఞాపకశక్తి తగ్గకుండా ఉండేందుకూ, మతిమరపు (డిమెన్షియా)ను నివారించేందుకు అవలంబించాల్సిన మార్గం చాలా రుచికరమైనదీ, ఇష్టమైనదీ! మరీ మాట్లాడితే రోగి కోరేదీ అదే, పరిశోధకుడు సూచించేదీ అదే! టీని వాసన పీలుస్తూ తాగండి చాలు.
తాజా వార్తలు
- బర్కాలో డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో ముగ్గురు అరెస్ట్
- యూఏఈలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు
- తెలంగాణలోని మీసేవా కేంద్రాల్లో రూల్స్ మారాయ్..
- యూఏఈలో భారీ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు
- నేరాల నియంత్రణ, బాధితులకు సత్వర న్యాయం పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం: సీపీ డా.ఎం.రమేశ్
- సాయికృష్ణ కేసు పై సీబీఐ విచారణ జరగాలి: వైఎస్ జగన్
- ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్..
- ఏపీకి భారీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలికి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
- రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు శ్రీనివాస్ మృతి
- విటమిన్ డి లోపం రిస్క్ పై నిపుణులు హెచ్చరిక..!!









