పెరిగిన పసిడి ధర
- March 22, 2017
అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరగడంతో పాటు స్థానికంగా కొనుగోళ్లు పెరగడంతో బంగారం ధర బాగా పెరిగింది. పది గ్రాముల పసిడి ధర రూ.300 పెరిగి రూ.29,350కి చేరింది. వెండి ధర కూడా బంగారం బాటలోనే నడిచింది. కిలో వెండి ధర రూ.41వేల మార్కు దాటిపోయింది. నేటి మార్కెట్లో కిలో వెండి ధర రూ.550 పెరిగి రూ.41,500కు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పెరిగినట్లు బులియన్ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు పెరిగాయి. సింగపూర్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.25శాతం పెరిగి 1,247.30 డాలర్లకు చేరింది. ఔన్సు వెండి ధర 0.20 శాతం పెరిగి 17.55డాలర్లకు చేరింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







