సైకిల్ పై షికారుకెళ్లిన మోహన్ లాల్!
- March 22, 2017
మలయాళ విలక్షణ నటుడు మోహన్ లాల్ తిరువనంతపురంలో సైకిల్ పై షికారుకెళ్లారు. తెల్లని లుంగీ, చొక్కా వేసుకున్న మోహన్ లాల్ కమాన్ మ్యాన్ లాగా సైకిల్ తొక్కుకుంటూ త్రివేండ్రం వీధుల్లో తిరిగాడు. ఉదయం 4న్నర గంటల ప్రాంతంలో సిటీలో ఆయన సైకిల్ తొక్కుకుంటూ వెళ్లారు. తనకు ఎంతో ఇష్టమైన త్రివేండ్రం సిటీలో ఈ విధంగా సైకిల్ తొక్కుకుంటూ తిరగాలనేది ఆయన చిరకాల కోరికని లోకల్ కేరళ పత్రిక కౌముది డెయిలీ పేర్కొంది.
ప్రజలు, అభిమానుల దృష్టిలో పడకుండా ఉండేందుకే ఆ సమయాన్ని మోహన్ లాల్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. కాగా, పాథానమ్ థిత్త జిల్లాలోని ఎలంతూర్ గ్రామానికి చెందిన మోహన్ లాల్ తిరువనంతపురం సిటీలో పెరిగారు. మోహన్ లాల్ యుక్తవయసులో ఉన్న సమయంలో తన ఫ్రెండ్స్ తో కలిసి ఉదయం సమయంలో సైకిల్ రైడింగ్ కు వెళ్లేవాడట. అక్కడి ప్రముఖ రెస్టారెంట్ ‘ఇండియన్ కాఫీ హౌస్’ లో కాఫీ తాగుతూ సమయం గడిపేవారి సమాచారం.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







