'మజ్నూ'గా వస్తున్న నాగ చైతన్య.!
- September 26, 2015
తొలిసారి నాగచైతన్య, శ్రుతి హాసన్ కలిసి నటించబోతున్నారు. మలయాళంలో విజయవంతమైన 'ప్రేమమ్'ని తెలుగులో 'మజ్ను'గా రీమేక్ చేయబోతున్నారు. అందులో నాగచైతన్య హీరోగా నటిస్తారు. 'కార్తికేయ' చిత్రంతో విజయాన్ని అందుకొన్న చందు మొండేటి దర్శకత్వం వహిస్తారు. ముగ్గురు హీరోయిన్స్ కి ఈ చిత్రంలో చోటుంది. ఓ కథానాయికగా శ్రుతి హాసన్ నటించనున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లబోతున్నారు. తెలుగు సినిమాకి సంబంధించినంత వరకు 'మజ్ను' అనగానే నాగార్జునే గుర్తుకొస్తారు. విషాదంతో కూడిన ఆ ప్రేమకథా చిత్రంలో నాగార్జున అంతగా ఒదిగిపోయి నటించారు. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ఆ చిత్రంలోని గీతాల్ని ప్రేక్షకులు ఇప్పటికీ పాడుకొంటుంటారు. ఇప్పుడు 'మజ్ను' పేరుతో నాగార్జున తనయుడు నాగచైతన్య ఓ చిత్రం చేయబోతున్నట్టు సమాచారం. తండ్రి చేసిన 'మజ్ను' విషాదంతో సాగితే... తనయుడు చేసే సినిమా మాత్రం వినోదాత్మకంగా తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది. జార్జ్ అనే కుర్రాడు టీనేజ్ లో, కాలేజ్ లో , సెటిలేజ్ లో ముగ్గురు అమ్మాయిలను ప్రేమిస్తాడు. వారి ప్రేమను సాధించుకోవటం లో ఊహించని అడ్డంకులు ఎదురై,కలలు కరిగిపోయి ప్రేమించిన వారు మరొకరితో సెటిల్ అవ్వతుంటే తట్టుకోలేక గుండె పగిలేలా.. ఇలా కథ సాగుతుంది. ఇక నివిన్ పౌలీ ఈ చిత్రంతో హీరో గా పరిచయమయ్యారు. ఆల్ఫోన్సే పూతరేన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అతి తక్కువ బడ్జెట్ లో తెరకెక్కింది. మే 29న విడుదలయిన ఈ చిత్రం పెద్ద హిట్టయ్యింది. జూన్ నెలలో విడుదలైన ఈ 'ప్రేమమ్' చిత్రం టాక్ బాగుండటంతో ... విదేశాలలోనూ విడుదల చేశారు. ఇక ఇప్పటికే ఈ సినిమా వసూళ్ళు యాభై కోట్లకు చేరుకున్నాయి. మళయాళ పరిశ్రమలో ఇలా లో బడ్జెట్ చిత్రం ఈ రేంజిలో హిట్ అయ్యి..ఇంత వసూలు చేయటం పెద్ద రికార్డు. ఈ చిత్రం రీమేక్ రైట్స్ కోసం తెలుగు, తమిళ, కన్నడ భాషల నుండే కాకుండా హిందీ పరిశ్రమనుండీ మంచి డిమాండ్ ఉందని ట్రేడ్ వర్గాల సమాచారం.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







