రైలు రాకపోకల్ని గూగుల్ మ్యాప్ లో చూసేయండి..!!
- September 26, 2015
దేశ వ్యాప్తంగా నడుస్తున్న రైళ్ల ప్రస్తుత స్థితిని ఇకనుంచి గూగుల్ మ్యాప్‌పై చూడొచ్చు. దీని కోసం కొత్త కంపెనీ (స్టార్ట్ఆప్) రైల్యాత్రి.ఇన్ ఓ వేదికను సిద్ధంచేసింది. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) ఆధారిత అప్లికేషన్ (యాప్) రూపొందించింది. ''రైల్ రాడార్ జీపీఎస్'' పేరిట తయారుచేసిన ఈ యాప్ ద్వారా రైలు ప్రస్తుతం ఎక్కడుందో గూగుల్ మ్యాప్‌పై చూడొచ్చని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. రైలు సమయం, ఆలస్యం తదితర విషయాలు కూడా తెలుసుకోవచ్చని పేర్కొంది. దీని కోసం స్మార్ట్ లొకేషన్ సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు వెల్లడించింది. రైలులో ప్రయాణిస్తున్న స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల స్థాన సంకేతాలను విశ్లేషించడం ద్వారా ప్రస్తుత రైలు స్థితిని చెప్పగలమని పేర్కొంది. రైలు సమాచారం అనంతరం ఎక్కువ మంది ప్రయాణికులు రైలు స్థితిని కొరుతున్నట్లు వివరించింది.
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







