ఔరా అనిపించనున్న న్యూయార్క్ లోని భవంతి
- March 24, 2017
వంపు తిరిగిన టీవీలను.. వంపు తిరిగిన మొబైల్ తాకేతెరలను ఇప్పటి వరకూ చూశాం. ఎత్తైన భవనాలు కూడా వంపు తిరిగి ఉంటే ఎలా ఉంటుంది? అదీ పూర్తిగా తిరగేసిన ‘యూ’ ఆకారంలోఅయితే?.. వూహించడానికే వింతగా ఉంది కదూ.. ఆర్కిటెక్చర్లు ప్రతిపాదించిన ఈ నిర్మాణం సాకారమైతే ప్రపంచంలోనే అతి ఎత్తైన ఆకాశహర్మ్యంగా ఇది నిలవనుంది. ఇప్పటి వరకూ ఉన్న రికార్డులను బద్దలు కొట్టనుంది. ఆకాశహర్మ్యాలు అంటే నిటారుగా ఉంటాయనే మనకు తెలుసు. విభిన్న ఆకృతుల కోసం కాస్త వంపు తిరిగిన భవనాలనూ చూశాం. అయితే, పూర్తిగా తిరగేసిన ‘యూ’ ఆకారంలో ఉండే భారీ ఆకాశహార్మ్యానికి సంబంధించిన ఆకృతి(స్ట్రక్చర్)ని ఇంజినీర్లు రూపొందించారు.
ఇంజినీరింగ్ అద్భుతంగా నిలిచే ఈ కట్టడం ఆకృతిని న్యూయార్క్‌కు చెందిన ఆర్కిటెక్చర్ స్టూడియో ‘ఒయియో’ రూపొందించింది. మాన్‌హట్టన్‌లో నిర్మించడానికి ప్రతిపాదించిన ఈ బహుళ అంతస్తుల భవన నిర్మాణం సాకరమైతే ప్రపంచంలోనే అతి ఎత్తైన కట్టడంగా ఇది నిలుస్తుందని చెబుతున్నారు రూపకర్తలు. మొత్తం 4 వేల అడుగుల ఎత్తు ఉండే ఈ భవనం ఇప్పటి వరకూ ఉన్న ప్రపంచ రికార్డులన్నీ చెరిపివేస్తుందట. ప్రపంచలోనే ఎత్తైన కట్టడాలకు ఇది రెట్టింపు సైజ్‌లో ఉంటుందట.
కేవలం ఆకృతిలోనే కాకుండా ఈ భవంతిలో మరిన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఇందులో ఏర్పాటు చేయబోయే లిఫ్ట్ కూడా యూ ఆకారంలో తిరుగుతుందట. నిలువుగా, అడ్డంగా, వలయాకారంగా ఇది తిరుగుతుందని బిల్డింగ్ సృష్టికర్తలు పేర్కొంటున్నారు. కంపెనీ వెబ్‌సైట్‌లో ఉంచిన ఈ భవంతి ఆకృతి పలువురిని విశేషంగా ఆకట్టుకుంటోంది.
తాజా వార్తలు
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!







