‘ఊపెకుహ’ సినిమా లోగో ఆవిష్క‌ర‌ణ‌

- March 24, 2017 , by Maagulf
‘ఊపెకుహ’ సినిమా లోగో ఆవిష్క‌ర‌ణ‌

దర్శకుడు నిధి ప్రసాద్‌ రూపొందిస్తున్న కొత్త చిత్రం…’ఊపెకుహ ‘(ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడి). జేబీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. రాజేంద్రప్రసాద్‌, సాక్షి చౌదరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘ఊపెకుహ’ సినిమా లోగో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్స్‌ లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ…’ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడి అనేది వ్యంగ్యంగా మాట్లాడే మాట. దీన్ని క్లుప్తంగా మార్చి సినిమాకు టైటిల్‌ గా పెట్టుకోవడం కొత్తగా ఉంది. సినిమాలో అంతా పేరున్న నటీనటులే నటించారు. క్యారెక్టర్స్‌ అన్నీ సరదాగా మలిచారు దర్శకుడు. వినోదాత్మకంగా అల్లరిగా సాగుతుంటుంది సినిమా. కమర్షియల్‌ అంశాలు బాగా ఉంటాయి.’ అన్నారు.
నిర్మాత విక్రమ్‌ మాట్లాడుతూ… ‘సినిమా పరిశ్రమకు రాకముందు వ్యాపారంలో ఉన్నాను. నిధి ప్రసాద్‌ ను నమ్మి, ఆయన్ను ఒప్పించి సినిమా చేస్తున్నాము. నటీనటులు, సాంకేతిక నిపుణులు అంతా బాగా సహకరించారు. అందరినీ అలరించే చిత్రమవుతుంది.’ అన్నారు. దర్శకుడు నిధి ప్రసాద్‌ మాట్లాడుతూ…’నేను దర్శకత్వానికి దూరంగా ఉండి చాలాకాలమవుతోంది. ఇక ఇప్పుడు నువ్వు సినిమాలు తీయలేవని చాలా మంది నిరుత్సాహపరిచారు. 
అయితే వాళ్లు చెప్పిన దానికి పరిశ్రమలోని పరిస్థితులకు సంబంధం లేదు. అంతా సహకరించారు. కథ పూర్తి అయిన తర్వాత నమ్మకం పెరిగి, మా కుటుంబ సభ్యులతోనే సినిమా చేశాను. అనుకున్న విధంగా సినిమా రావడం సంతోషంగా ఉంది. ‘ అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com