'నిన్నుకోరి' రిలీజ్ డేట్ కంఫర్మ్ అయింది
- March 25, 2017
ప్రజెంట్ నాని ఫుల్ స్పీడ్ మీద ఉన్నాడు..ఓ సినిమా రిలీజ్ లోపే మరో సినిమాను సెట్స్ ఫైకి తీసుకెళ్తే మూడు నెలల్లో ఓ సినిమాను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇటీవలే నేను లోకల్ చిత్రం తో 34కోట్లకు పైగా షేర్ వసూలు చేసి చరిత్ర సృష్టించేశాడు. ప్రస్తుతం 'నిన్ను కోరి' అనే చిత్రం చేస్తున్నాడు. శివ నిర్వాణ అనే కొత్త దర్శకుడు ఈ మూవీ రూపొందిస్తుండగా.. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైద్రాబాద్ పరిసరాల్లో జరుగుతోంది. అమెరికా బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ మూవీ కోసం.. తొలి షెడ్యూల్ ను యూఎస్ లోనే చేయగా.. ఈ నెలలోనే అక్కడ షూటింగ్ పూర్తయింది. సమ్మర్ మధ్యలోనే షూటింగ్ పార్ట్ అంతా పూర్తయిపోతుందని సమాచారం.
జూన్ నెలాఖరు వరకు ఇప్పటికే భారీ సినిమాలు క్యూ కట్టేయడంతో..
జూలైలో తన నిన్ను కోరి మూవీని విడుదల చేయాలని చూస్తున్నాడట నాని. జూలై 7న కానీ.. 14న కానీ.. నిన్నుకోరి చిత్రం రిలీజ్ చేసేలా చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
నాని కి జోడిగా నివేదా థామస్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఆది పినిశెట్టి కీలకప్లాన్ పాత్రలో కనిపించనున్నాడు.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్‌లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్‌ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









